ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

Thu,September 13, 2018 01:03 AM

-శ్రీశైలం ఇన్‌ఫ్లో 32,477, అవుట్‌ఫ్లో 60,546 క్యూసెక్కులు
-జూరాల ఇన్‌ఫ్లో 12,000, అవుట్‌ఫ్లో 5,350 క్యూసెక్కులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి/అమ్రాబాద్ రూరల్ : ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు స్వ ల్పంగా వరద కొనసాగుతుంది. శ్రీశై లం ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 9 గంటల వరకు 32,477 క్యూసెక్కుల ఇన్‌ఫో, 60,546 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులో నీటిమట్టం 878.80 అడుగులతో 181. 8320 టీఎంసీలకు చేరుకుంది. కాగా తెలంగాణ పవర్ హౌస్ నుంచి 31, 783 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా పోతిరెడ్డిపాడుకు 24, 000, హంద్రినివా 2363 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐ 2400 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జూరాల ప్రాజెక్టుకు బుధవారం 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌పో 5,350 క్యూసెక్కులుగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయం నీటి మట్టం 318. 480 మీటర్ల స్థాయిలో 9.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 835 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్నాటకలోని ఆల్మటి నుంచి 10,108 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 9,149 క్యూసెక్కులు విడుదలవుతున్నట్లు పీజే పీ అధికారులు వెల్లడించారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles