అవినీతి నిర్మూలన కోసం ఉద్యమించాలి

Thu,September 13, 2018 01:02 AM

గద్వాల అర్బన్: సమాజ అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసర ముందని ఆల్ ఇండియా అవినీతి నిరోధక రాష్ట్ర చైర్మన్ అనూప్ చక్రవర్తి అన్నా రు. బుధవారం స్థానిక తెలంగాణ భవన్‌లో అవినీతి నిరోధక సంఘం సభ్యుల సమావేశ మై య్యారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... విద్యార్థులు అవినీతి నిర్మూలన గురించి తెలుసుకోవాలని, రేపటి సమాజంలో వారే పౌరులని గుర్తుచేశారు. అవినీతి నిర్మూలన గూరించి అవగాహన కార్యాక్రమలు చేపట్టాల న్నారు. సమాజంలో ఎక్కడ అవినీతి జరుగుతందో ఏఐఏసీసీకి సమాచారం తెలిపితే తక్షణమే ఏసీబీ, పోలీస్‌ల సహకారంతో అవినీతి పరుల ఆట కట్టిస్తామన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే 9703004004ఈ నెంబర్‌కు సమాచారం అందిం చాలన్నారు. అనంతరం స్థానిక దివ్యాంగుల పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఏఐఏసీసీ చైర్మన్ పూర్ణచందర్‌రావు, సెక్రటరీ నరసింహ, సభ్యులు సుధాకర్, రమేష్, సుమన్, రవి, శాంతన్న, రఘు, దిలీప్ పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles