కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి


Thu,September 13, 2018 01:02 AM

ఇటిక్యాల : కృష్ణానదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం బీచుపల్లి పురష్కరఘాట్ వద్ద చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మం డలంలోని పల్లెపాడు గ్రామానికి చెం దిన ఆంజనేయులు(45) మంగళవా రం ఉదయం కుటుంబ సభ్యులతో ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన అతను బుధవారం ఉదయం బీచుపల్లి సమీపంలో ని కృష్ణానదిలో శవమై కన్పించాడు. స్థానిక జాలర్లు బుధవారం ఉదయం నదిలో శవం తెలియాడుతుండటాన్ని గుర్తించి ఇటిక్యాల ఎస్సైకి సమాచారం అందజేశారు. మృతుడ్ని నదిలో బయటకు తీసి స్థానికుల సహాయంతో అత ను పల్లెపాడ్ ఆంజనేయులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఏరియా దవాఖానకు తరలించా రు. అనంతరం ఆంజనేయులు మృతికి గల కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నా రు. ఆంజనేయులు మృతితో పల్లెపాడు గ్రామంలో పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...