వీఆర్వో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

Wed,September 12, 2018 12:47 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: ఈ నెల 16న జరిగే వీఆర్‌వోల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు , కళాశాల, పాఠశాలల నిర్వాహకులు సహకరించి పరీక్షలు విజయవంతంగా జరగడానికి కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో జరిగిన వీఆర్‌వో పరీక్షల నిర్వాహణ సమావేశంలో కలెక్టర్ పాల్గొని పరీక్షల నిర్వాహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11గంటల నుంచి మ ధ్యా హ్నం 1:30గంటల వరకు పరీక్ష జరుగుతుందని పరీక్షకు నిమిషం ఆలస్యమై న అభ్యర్థులను అనుమతించేది లేదని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెల్‌ఫోన్స్ , ఎలాక్ట్రానిక్ గూడ్స్ తీసుక రా కూడదని చెప్పారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 80 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 21,376 మంది అభ్యర్థులు పరీక్ష లు రాస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మొదటి సారిగా పెద్ద ఎత్తు న నియమించే వీఆర్‌ఓ పోస్టులకు జరిగే పరీక్షలను పకడ్బందిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పా టు చేయాలని పోలీసుకు ఆదేశించా రు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేలా ఆర్టీసీ వారు తగు ఎర్పాట్లు చే యా టలన్నారు. ప రీక్ష కేంద్రాల వద్ద తాగునీరు ,విద్యుత్ స దుపాయాలు క ల్పించాలని అధికారులకు ఆదేశించా రు.ప్రశ్నాపత్రాలను ఆ యా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉంటాయని ప రీక్ష స మయానికి ముందు ఆయా పోలీస్ స్టేష న్ల ఎస్‌ఐల ఆధ్వర్యంలో కేం ద్రాలకు పంపబడుతాయని చెప్పారు. ముందుగానే అధికారులు రూట్ మ్యా ప్ తయా రు చేసుకోవాలన్నారు.ఎక్కడైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుక రావాలన్నారు.

తహసీల్దార్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్ల ను పరిశీలించాలని ఆదేశించారు.కేంద్రాల వద్ద సదుపాయాలు ,భద్రత తదితర వా టిపై రెండు రోజుల లోగా పూర్తి నివేదిక తనకు అందజేయాలని ఆదేశించా రు.అలాగే ఓటర్ జాబితా అనంతరం మార్పులు ఉంటే తగు ఫారాలలో నిం పి మార్పులు ,చేర్పులు చేసేలా చర్య లు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జేసీ నిరంజన్ మాట్లాడుతూ జిల్లాలో జరిగే వీఆర్‌ఓ పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూ చించారు.పరీక్ష కేంద్రాలలో అన్ని ఏ ర్పాట్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌లకు ఆదేశించారు. ఏమైన సమస్యలు ఉంటే జేసీ ఫోన్ నం 9100901601, డీఈవో 799508 7603 లకు సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వి ద్యాధికారి శుశీందర్‌రావు ,డీఎస్పీ షాకిర్‌హుస్సేన్ మన్ని మండలాల తహసీల్దా ర్ లు కళాశాల , పాఠశాల యజమాన్యా లు పాల్గొన్నారు.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles