దేవాలయ భూములను పరిరక్షిస్తాం

Wed,September 12, 2018 12:46 AM

-ఎండోమెంట్ జిల్లా అధికారిణి వెంకటేశ్వరి
వడ్డేపల్లి : దేవాలయ భూములను కా పాడటానికి కృషిచేస్తామని దేవుని భూ ము లను దేవుని పేరిట పాసుపుస్తకాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని ఎండో మెంట్ అధికారిణి వెంకటేశ్వరి అన్నారు. మండలంలోని జిల్లెడదిన్నె గ్రామంలో ఆంజనేయస్వామికి చెందిన కిద్మత్ ఇనాం భూములను అనుభవిస్తూ దేవుడికి సేవ చేయడంలేదని గ్రామస్తులు ఫిర్యాదు మేరకు మంగళవారం ఆమె సర్వే నంబర్ 50లో దేవాలయానికి చెందిన 16 ఎకరాల భూమిని పరిశీలించారు. దేవుని మాన్యం అనుభవిస్తూ గ్రామంలో ఉండకుండా దేవునికి సేవలు చేయకుండా పూజారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు సుదర్శన్, స్వాములు, వెంకట్రామిరెడ్డి, గజేందర్ రెడ్డిలు ఆమెకు ఫిర్యాదు చేశారు. ఆంజనేయస్వామి, శివాలయం, ఎల్లమ్మ, పరుశురామ దేవాలయాలను ఆమె పరిశీలించి ఆలయంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఆలయ పూజారులతో మాట్లాడారు.

16 ఎకరాల దేవాలయ భూమిని వేలం వేసి కౌలుకు ఇచ్చి ఆ డబ్బులతో దేవాలయంలో పూజలు జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చా రు. దేవాలయ కిద్మత్ ఇనాం భూములను అక్రమంగా ఓఆర్‌సీలు తీసుకొని అనుభవిస్తున్న వారి నుంచి దేవాలయ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. భూ ములు అన్యాక్రాంతం కాకూడదని తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తున్న దని, అందుకే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి అర్హులకే పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామ దేవతల దేవాలయాలు బాగా నిర్మించుకున్నారని ఆమె అభినంధించారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యానికి వెళ్లి 54, 55ఎండోమెంట్ ఖాస్ర్తా సేత్వార్ ఇవ్వాలని సూచించారు. వారంలోగా ప్రతి గ్రామానికి చెందిన ఆలయ భూముల వివరాలు, పహాణీలు ఇవ్వా లని సీనియర్ అసిస్టెంట్ మధుకు సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది దేవాలయ కాపాడే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. చాలా గ్రామాల్లో అవినీతికి పా ల్పడి దేవాలయ భూములను అ న్యాక్రాంతం చేశారని, ఇతరుల పేరిట పాసుపుస్తకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఎండోమెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

111
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles