ఓటమి భయంతోనే దాడులు


Wed,September 12, 2018 12:46 AM

ఇటిక్యాల: కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతోనే టీ ఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకుపాల్పడుతున్నారని మం డల టీఆర్‌ఎస్ నాయకులు గు మ్మాగోవర్దన్, నర్సింహారెడ్డి, మహేశ్వ ర్‌రెడ్డి, పరుషరాం పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం రాజోలి మండలం పచ్చర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అనుచరులు దాడి చేసి టీఆర్‌ఎస్ కార్యకర్త రవికుమార్‌ను తీవ్రంగా గాయ పరిచారన్నారు. రోజు రోజుకు టీఆర్‌ఎస్‌పై ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. ఇలా దాడులు చేస్తున్న వారికి త్వరలో జరుగ బేయే ఎన్నికలలో అలంపూర్ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెబుతారని వారన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...