ముగిసిన మండల స్థాయి ఆటల పోటీలు

Wed,September 12, 2018 12:45 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలమేరకు మంగళవారం ఉద యం స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ (ఎస్‌జీఎఫ్)అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి మూడు టీంలు పాల్గొన్నాయి. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర ఆటలు ఆడించారు. అలంపూర్ పట్టణంలోని హరిజనవాడ ప్రభుత్వపాఠశాలలో ఉదయం 10గంటల నుంచి సాయం త్రం వరకు కొనసాగాయి. ఈ క్రీడల్లోమండలంలోని ఆయా పాఠశాలల వ్యాయమ ఉపాధ్యా యులు పాల్గొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చినక్రీడాకారులకు హెచ్‌ఎం నాగరాజు బహుమతు లు ప్రధానం చేశారు. మేరకు నాగరాజును ఎంఈవో అశోక్‌కుమార్, వెంకట్రామయ్య శోశెట్టి, వెంకట రంగయ్య బాలాజి తదితరులు సన్మానించారు.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles