గద్వాల, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విధి నిర్వాహణలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి అటవీ సంపదను కాపాడిన అటవీ అమర వీరులను స్మరించుకుంటూ ఈ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర అధికారి చంద్రశేఖరాచారి మాట్లాడుతూ విధి నిర్వాహణలో అటవీశాఖ అధికారులు జాకబ్, రాణాప్రతాప్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అటవీ సిబ్బంది అడవుల్లో సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీశాఖ సిబ్బంది రాఘవేంద్ర, రవికాంత్, వాజీద్, నాగజ్యోతి పాల్గొన్నారు.