విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ


Wed,September 12, 2018 12:45 AM

గద్వాల అర్బన్ : మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్ తన సొంత ఖర్చుతో 100 మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా దూసుకుపోవాలని సూచించారు. నేటి ప్రపంచంలో క్రీడారంగం కూడా ఒక ఉపాధిని అందిస్తుందని విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరిలో ఒక సృజనాత్మకత ఉంటుందన్నారు. దానిని బయటకు తీసే సమయం ఆసన్నమయ్యిందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు మహానుభావులను దృష్టిలో ఉంచుకొని వారి అడుగు జాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...