విద్యుత్ మోటర్ నిందితులకు రిమాండ్


Wed,September 12, 2018 12:45 AM

ఇటిక్యాల : మండలంలోని శివనంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి లో రైతులు ఏర్పాటు చేసుకొన్న రెండు విద్యుత్ మోటర్లు కొన్ని రోజల కిందట గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై అప్పట్లో బాధిత రైతు లు ఇటిక్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై జగదీశ్ కేసు నమోదు చేసుకొని విచారణ నిర్వహించారు. ఈ మోటర్లు దొంగతనానికి పాల్పడింది మొగలిరావుల చెరువు గ్రామానికి చెందిన నడిపి నర్సింహ, పరశురాముడులను నిందితులుగా గుర్తించి వారి నుంచి ఒక మోటరును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి నుంచి మోటర్‌ను కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...