దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష


Wed,September 12, 2018 12:44 AM

రాజోళి : గతంలో దొంగతనాలకు పాల్పడిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష ఖరారు అయ్యింది. రాజోళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్దకల్ మండలానికి చెందిన బోయ నర్సింహులు, జయన్న అనే ఇరువురు దొంగలు మండలంలోని పెద్ద దన్వాడ, ముండ్లదిన్నె, నసనూర్ గ్రామాల్లో పలు చోరీలకు పాల్పడగా.. 2014 సంవత్సరంలో రాజోళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు 10.9.18 నాడు అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాధిక వారికి ఆరు నెలలు జైలు శిక్ష, వంద రూపాయలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...