ప్రజలే ప్రచారకర్తలు

Tue,September 11, 2018 01:58 AM

-నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్న నడిగడ్డ ప్రజలు
-ఆనందాన్ని చాటుతున్నలబ్ధిదారులు
-గెలిపించే బాధ్యత తమదేనని భరోసా
-ఎప్పటికీ మా సీఎం కేసీయారే..
-ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
జోగుళాంబగద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న ఎన్నికల ప్రచారంలో ఎన్నడూలేని వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సా ధారణంగా ఎన్నికల ప్రచారంలో పోటీచేసే అభ్యర్థులు తమ పార్టీ అమలు చేసిన సం క్షేమ పథకాల గురించి, భవిష్యత్తులో అ మలు చేయబోయే పథకాలను గురించి వి వరిస్తూ క్యాంపెయినింగ్ చేపడుతారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను వివరిస్తూ తమ పార్టీకి ఓట్లు వే యాలని విజ్ఞప్తులు చేస్తుంటారు. కాని ఈ సారి ఎన్నికల ప్రచారంలో నడిగడ్డలో ఊ హించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజలే ప్రచారకర్తలుగా మారి తా మందుకున్న పథకాల ఫలాలను వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వల్లూరు మల్లెపోగు అబ్రహం వెంట మేమున్నామని ప్రజలే భరోసా కల్పిస్తున్నారు.

నాలుగున్నర ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనకు ప్రజలు ముగ్ధులైపోయారు. గుండెల్లో గూడుకట్టుకొని అభిమానాన్ని చాటి చెబుతున్నారు. పేదప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నీ తొలిగిపోయే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. అన్నింటా పెద్దదిక్కులా ఆదుకున్నందుకు తమ కృతజ్ఞతలను చా టుకునేందుకు సిద్ధమవుతున్నారు. లబ్ధిదారులంతా తాము పొందిన పథకాల ఫలాలను ఇరుగుపొరుగుతో పంచుకుంటున్నా రు. అద్భుతమైన పాలనను అందించి తె లంగాణ రాష్ట్రం రూపురేఖలను మారుస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టీఆర్‌ఎస్‌కే తామంతా ఓటు వేస్తామని ముక్తకంఠంతో చాటి చెబుతున్నారు.

ప్రచారంలో ప్రజల భాగస్వామ్యం
నడిగడ్డ ప్రజలు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ నా యకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. 70 ఏళ్ల స్వతంత్య్ర చరిత్రలో ఈ నాయా ట్రెం డుకు కారణమైన ఏకైక నాయకుడు ఎవరయ్యా అంటే టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌నే చెప్పుకోవాలి. ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి టీఆర్‌ఎస్ పార్టీ కోసం ప్రచారకర్తలుగా మారుతున్నరంటే నాలుగున్నర ఏళ్లలో ఎంతటి అద్భుతమైన పాలనను అందించారో ఒకసారి ఊహించవ చ్చు. పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ, చేపవిత్తనాల పంపిణీ, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలే ఈ అనూహ్యమార్పులకు కారణమవుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఎక్కడ ప్రచారం చేపట్టిన, ఎక్కడ సమావేశాలు నిర్వహించిన ప్రజలు తమంతట తాము వచ్చి అందుకున్న సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.

కృష్ణమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలి..
నా మనమడిలా అన్ని విధాల అండ గా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడటమే నా చివరి కోరిక. సీఎం కేసీఆర్ ఇస్తున్న రూ.వెయ్యి పెన్షన్‌ను కృష్ణమోహన్ రెడ్డియే నాకు ఇప్పించాడు. శాతగానోళ్లకు టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ బుక్కెడు బువ్వ తినేందు కు నెలనెల పెన్షన్ ఇస్తున్నాడు. చచ్చేముందు తలెత్తుకొని జీవించేలా ఆదుకుంటున్నాడు. పెన్షన్ తీసుకునేటోళ్లు అందరూ టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలి.

-హనుమంత్‌రెడ్డి, గద్వాల మండలం (గద్వాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో)
ఎకరానికి రూ.4వేలు ఇచ్చిన టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలి..
గత 40ఏళ్లుగా రాజకీయాలను చూ స్తున్నా... ఎంతో మంది ముఖ్యమంత్రు లు, మంత్రులు మారిపోయారు.. కాని ఒక్కరూ కూడా రైతుల గురించిన పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ నాలుగేళ్లలో ప్రజల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూశాను. నా కు ఉన్న 10ఎకరాల భూమికి ఎకరాకు రూ.4వేల చొప్పున రూ.40వేలు ఇచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి దగ్గరుండి చెక్కు లు ఇప్పించాడు. బతికి ఉన్నంతవరకు టీఆర్‌ఎస్ పార్టీకి రుణపడి ఉంటా. చచ్చేవరకు కారు గుర్తుకే నాటు వేస్తాను. కృష్ణమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడటమే లక్ష్యంగా పనిచేస్తా..
- జగన్‌రెడ్డి, బస్వాపురం (గద్వాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో)

షాదీముబారక్ పేదలకు వరం..
ముస్లిం మైనారీటీలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఆయన ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం ద్వారా ఎంతో మంది పేద ముస్లిం ఆడబిడ్డల వి వాహాలు జరిగాయి. ఇప్పటి వరకు ముస్లింల జీవితాలను ప్రభావితం చేసే పథకాలను ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కారు గుర్తుకు ఓటు వేసి కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా చేసి సీఎం కేసీఆర్‌కు బహుతిగా అందిస్తాం. పేదల కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరం కార్యకర్తలుగానే కృషి చేస్తాం.
-రమీజా బీ, గద్వాల (గద్వాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో)
ఒకే రోజు ఆరు కాన్పులు
ధరూర్ : ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు ఆరు కాన్పులు జరిగినట్లు ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి స్రవంతి తెలిపారు.ఆదివారం ఉదయం 8గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆరుగురు గర్బిణులు ప్రసవాల నిమిత్తం చేరారు. వారందరికి వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు జరిపినట్లు వైద్యాధికారి తెలిపారు. పాతపాలెం, గట్టు మండలం మాచర్ల, మార్లబీడు, ఇర్కిచేడు తదితర గ్రామాల నుంచి వీరు వచ్చారన్నారు. అందులో ఐదుగురికి మగ శిశువులు,ఒకరికి ఆడ శిశువు ప్రసవించారని, తల్లీబిడ్డలందరూ కూడా క్షేమంగా ఉన్నారన్నారు. వారందరికీ కేసీఆర్ కిట్‌లు అందజేసి, 102ఆంబులెన్స్‌లో స్వగ్రామాలకు పంపుతున్నట్లు ఆమె తెలిపారు. వైద్య సిబ్బంది విజయ, గీత తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ ను కలిసిన బండ్ల
గద్వాల,నమస్తేతెలంగాణ: జోగులాంబ గద్వాల జిల్లాకు నూతన కలెక్టర్‌గా వచ్చిన శశాంకను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గద్వాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ కేశ వ్ , జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు చెన్నయ్య, గద్వాల ఎంపీపీ సుభాన్, గట్టు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్ , నేతలు మహేశ్వర్‌రెడ్డి , భాస్కర్‌రెడ్డి , సంజీవులు , లక్ష్మణ్ తదితరులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కంటి వెలుగును ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా అధికారి
రాజోళి: మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామంలో జరు గుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజేంద్రకుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి కార్య క్రమానికి మంచి స్పందన వస్తుందని, కార్యక్రమంలో ఎలాం టి ఇబ్బందులు లేకుం డా నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య పరీక్షలకు వచ్చిన వారి తో కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికా ర్డులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో కంటి వెలుగు డీఈవో జయప్రకాష్, చంద్ర మోహన్, జయ మ్మ, శిరీష, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles