ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం

Tue,September 11, 2018 01:57 AM

-టీడీపీ, కాంగ్రెస్‌లవి నీతిమాలిన రాజకీయాలు
-రాహుల్ గాంధీ పెళ్లి కాని ప్రసాద్
-ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
-గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి
-వలస పాలకులను తరిమి కొడదాం
-జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్
-టీఆర్‌ఎస్‌లో చేరిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
గద్వాల, నమస్తే తెలంగాణ : రానున్న అసెంబ్లీ ఎన్నికలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ పత్తి మిల్లులో గద్వాల మండల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జెడ్పీచైర్మన్ ముందుగా మాట్లాడుతూ శాసనసభ రద్దు చేసిన కారణంగా ముందస్తు ఎన్నికలు త్వరలోనే రానున్నాయన్నారు. వాటికి మనం సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. రా్రష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ పెళ్లి కాని ప్రసాద్ అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌లో ఎవరికి వారు ముఖ్యమంత్రులమని ప్రకటించుకుంటున్నారన్నారు. వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఎవరూ తమ ఓటును అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు.

గతంలో జరిగిన వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నానని, ఈసారి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్ కార్యకర్తలను కోరారు. గెలిపిస్తే నియోజక వర్గ అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. గత కొన్నేళ్లుగా నియోజక వర్గాన్ని వలస పాలకులు పాలిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో వలస పాలకులను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు రాజీకీయ బిక్ష పెట్టింది గద్వాల మండల ప్రజలని చెప్పారు. కుల సంఘాలకు చేయూతనిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఇక్కడి పాలకులు దౌర్జ్యానాలు చేస్తూ ప్రజలకు డబ్బులు పంచి డబ్బుబలంతో గెలుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్, విత్తనాల కోసం రోడ్లు ఎక్కి నిరసనలు చేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కరెంట్ కష్టాలు లేకుండా చేసిందన్నారు. గద్వాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి రూ.100 కోట్ల కేటాయించాడన్నారు. ప్రతి గ్రామంలో ఒక ఫంక్షన్‌హాలు నిర్మిస్తామని చెప్పారు. గద్వాల మండలంలోని గుర్రంగడ్డ గ్రామానికి బ్రిడ్జి నిర్మిస్తామన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గద్వాల మండలం నుంచి 5 వేల మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు. కార్యకర్తల ధైర్యమే తనకు కొండంత అండ అన్నారు. రెండుసార్లు ఓడినా కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రైతులకు కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మలకు టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. కార్యకర్తల సమావేశంలో జంగంపల్లి, పూడురు, లత్తి పురం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు జగదీశ్వర్‌రెడ్డి, యాకోబ్, సమరసింహారెడ్డి, వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టిలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, జిల్లా రైతు సమన్వయప సమితి అధ్యక్షుడు వెంకట్రాములు జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాములు నేతలు పర్మాల నాగరాజు, సంజీవులు, రాములు, ప్రతాప్‌గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, జయరామిరెడ్డి, సతీశ్, వాసు, చక్రధర్, గోపిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, దమోదర్‌రెడ్డి, సంజీవులు ఉన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles