ఎన్నికలకు సిద్ధంగా ఉండండి


Tue,September 11, 2018 01:57 AM

= రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి
= ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్,పోలీస్ అధికారులతో వీసీ
= గద్వాల, అలంపూర్‌లకు రిటర్నింగ్ అధికారిలుగా జేసీ, ఆర్డీవో
= ఓటర్ జాబితాలో పేర్ల సవరణకు ఈ నెల 25 చివరి అవకాశం
= కలెక్టర్ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రిటర్నింగ్ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారా లేదా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని కోరారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పకడ్బందీగా నిర్వహించేం దుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో రెండు నియోజక వర్గాలు ఉన్నాయని, గద్వాలకు రిటర్నింగ్ అధికారిగా జేసీని, అలంపూర్‌కు ఆర్డీవో రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముందస్తు రావడం వల్ల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టరోల్‌లో ఓటర్ పేరు నమోదు పక్రియ 1-1-2018వ తేదీని ప్రమాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తైన యువతీ, యువకులు తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేందుకు అర్హులుగా ప్రకటించారు. ముపాయిదా ఓటర్ జాబితా ఈ నెల 10వ తేదీన ప్రచురించడం జరిగిందన్నారు. ఈ జాబితా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ప్రతి ఓటరు తమ పేర్ల సవరణ మార్పు చేర్పులకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ప్రతి ఓటరు తమ పేర్లు జాబితాలో ఉందా లేదా ఏమైనా తప్పులు ఉన్నాయా అనే విషయాన్ని విధిగా పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. అందులో తమ అభ్యంతరాలు, కొత్త ఓటర్ల దరఖాస్తులు ఇవ్వవచ్చని చెప్పారు. అన్ని ఫిర్యాదులను అక్టోబర్ 4వ తేదీ వరకు పరిష్కరించి, అక్టోబర్ 7వ తేదీన ఓటర్ల తుది జాబితా ముద్రణకు పంపటం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ లక్ష్మీనాయక్, ఆర్డీవో రామునాయక్ పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...