నాయకుడిని కాదు సేవకుడినే

Tue,September 11, 2018 01:57 AM

-కార్యకర్తలను కళ్లలో పెట్టుకొని చూసుకుంటా..
-కుల, మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేయాలి
-అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం
ఉండవెల్లి/రాజోళి : నేను నాయకుడిని కాదు.. ప్రజా సేవకుడినని టీఆర్‌ఎస్ అలంపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం అన్నారు. ఉండవెల్లి మండలంలోని మారమునగాల-1 గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఈరన్నగౌడ్, రవిప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన టీడీపీ నాయకుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకుడు మల్లయ్యశెట్టి, మత్స్యశాఖ అధ్యక్షుడు మేకల మద్దిలేటి, వారి అనుచరులు, కార్యకర్తలు, మహిళలకు అబ్రహం టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో ఆయా పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం ఆధ్వర్యంలో భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ నాలుగు సంవ్సరాలుగా అలంపూర్ నియోజక వర్గం పరాయి కాంగ్రెస్ పాలనలో నలిగిపోయిందన్నారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నా రన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారిని కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని కార్యకర్తలకు భరోసానిచ్చారు. నియోజక వర్గంలో ప్రతి ఒక్కరూ కుల, మతాలు, వర్గబేధాలకు అతీతంగా ముందుకు వచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం చాలా శుభపరిణామం అన్నారు. ఊరి సింగరం గోడలు చేపుతాయి అనే చందంగా అలంపూర్ నియోజకవర్గ పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించామన్నారు. కానీ ఇక్కడి ప్రజా ప్రతినిధి నిధులను రాబట్టడంలో విఫలం అయ్యారన్నారు. ప్రతిపక్ష నాయకుల గారడి మాటలు నమ్మకండి.. రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న పథకాలను చూసి అధికారం అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు దశ, దిశను నిర్దేశించారు. వడ్డేపల్లి మండలం రామాపురం, ఇటిక్యాల మండలం చాగాపురం, అలంపూర్ మండలంలోని బుక్కాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు అలంపూర్ చౌరస్తాలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అబ్రహం, ఇటిక్యాల జెడ్పీటీసీ ఖఘన్నాథ్‌రెడ్డి, అలంపూర్ ఎంపీపీ శంషాద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, నారాయణరెడ్డి, అల్లా బకాస్, అలంపూర్ మాజీ సర్పంచ్ జయరాముడు, బాలరాజు, కురుమూర్తి, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles