ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టుకోవద్దు


Tue,September 11, 2018 01:56 AM

= ప్రజావాణిపై అధికారులకు కలెక్టర్ శశాంక హెచ్చరిక
గద్వాల, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వారి వద్ద పెండింగ్‌లో పెట్టుకోకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిని ఒక ప్రవాసంగా మార్చవద్దని సూచించారు. అధికారులు ప్రజావాణికి వచ్చేటప్పుడు వారి వద్ద ఉన్న పెండింగ్ సమస్యల లిస్ట్‌తో రావాలన్నారు. వచ్చిన ఫిర్యాదును ఏదో జవాబు లేని సమాధానంతో మూసి వేయొద్దని చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి తమ ఫిర్యాదులు తీసుకొని వస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా తగిన పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందన్నారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను పరిష్కారం చేయటమా లేదా పరిష్కారం కాని పక్షంలో అందుకు సరియైన సమాధానం సంబంధిత శాఖ అధికారి వద్ద తప్పక ఉండాలని చెప్పారు. వచ్చే ప్రజావాణికి జిల్లా ఉన్నతాధికారులు తమ వద్ద ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఫిర్యాదుల జాబితాను తీసుకుని హాజరు కావాలన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 39 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులో చాలా వరకు భూ సమస్యలపైనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఉండగా ఎస్పీ లక్ష్మీనాయక్, బెటాలియన్ కమాండెంట్ వేణుగోపాల్, ఎమ్మెల్యే అరుణ జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్చాలు అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...