స్వచ్ఛమైన భాష కోసం ..


Mon,September 10, 2018 01:06 AM

-పరితపించిన మహనీయుడు కాళోజీ
గద్వాల, నమస్తే తెలంగాణ : ప్రజల నాలుకలపై నడయాడే సహజమైన, స్వచ్ఛమైన భాష కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కాళోజీ అని, ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం శుభపరిణామమని జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణ వైతాళికుడని, జీవితకాలం తాను మేల్కొంటూ నిద్రపోయేవారిని మేల్కొలిపేవారని చెప్పారు. భూస్వాములు పాలన చేస్తున్న కాలంలో ప్రజా హక్కులకు భంగం కలిగినప్పుడు పాలకులను ప్రశ్నించిన ధైర్యశాలి అని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో భాష, సంస్కృతి కనుమరుగైపోతున్నాయని, ఈ సమయంలో ప్రభుత్వం భాష దినోత్సవం జరపడం తెలుగు భాషపై ప్రభుత్వానికి ఉన్న మక్కువను తెలియ జేస్తుందన్నారు. తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ ప్రజల భాష ప్రతి ఫలించేలా కాళోజీ కృషి చేశాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీపీ సుభాన్, జెడ్పీటీసీ భాస్కర్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్ నేతలు నజీర్, గోవిందు, కృష్ణకుమార్ రెడ్డి, నర్సింహులు, విజయ్, గంజిపేట మధు, మహిమూద్, శేఖర్‌రెడ్డి, వాసు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...