చెరువులకు నీరు విడుదల చేయండి

Sun,September 9, 2018 01:19 AM

- నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అబ్రహంకు రైతుల వినతి
అయిజ: మండలంలోని బింగిదొడ్డి, శేషమ్మ, కొత్త చెరువులకు నెట్టెంపాడ్ నీటిని విడుదల చేసి పంటలకు అందించాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. గట్టు మండలంలోని ముచ్చోనిపల్లి రిజర్వాయర్, మల్దకల్ మండలంలోని తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వా యర్లను పూర్తి స్థాయి నీటి మట్టం వరకు నీటితో నింపితేనే అయిజ మండలంలోని చెరువులకు నీరు చేరుతుందని, అందు కుకావాల్సిన చర్యలను అధికారులతో మాట్లాడి చెరువులకు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు రైతు సంఘం నాయకులు చంద్ర శేఖర్‌రెడ్డి తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితితుల కారణంగా మండలంలోని పంటలు ఎండుదశకు చేరుకుం టున్నా యని, చెరువులకు నీటిని విడుదల చేయడంతో సమీపంలోని పొలా ల రైతులు నెట్టెంపాడ్ నీటిని సద్వినియోగం చేసకుని పంటలను కాపాడుకునే అవకాశం ఉందని వివరించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే అబ్రహం సానుకూలంగా స్పందిస్తూ పీజేపీ అధికా రులతో మాట్లాడి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, తిప్పారెడ్డి, సత్యరాముడు తదితరులు ఉన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles