కొనసాగుతున్న ఇంటింటికీ అంగన్‌వాడీ

Sun,September 9, 2018 01:19 AM

ధరూర్ : స్త్రీ, శిశు సంక్షేమం పట్ల ప్రభుత్వం చేపడుతన్న సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంగన్‌వాడీ కార్యకర్తలు తెలిపారు. శనివారం మండలంలోని ఉప్పేరు, ర్యాలంపాడు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అంగన్‌వాడీ విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలు, పాలు, గుడ్డు, పంపిణీ, సరియైన సమయంలో టీకాలు వేయించడం, అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. అదే విధంగా కిషోర బాలికల ఆరోగ్య సంరక్షణ, బాలింతలు, గర్భిణులకు అందుతున్న సేవలను వివరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందిర, కృష్ణవేణి, లక్ష్మి, నాగమణి, చంద్రాబాయి, ఏఎన్‌ఎం గౌసియా, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంవీఎఫ్ క్లస్లర్ స్థాయి సమావేశం
గట్టు : మండలంలోని బలిగేర ఎంవీఎఫ్ కార్యాలయంలో ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక క్లస్లర్ స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంవీఎఫ్ సమన్వయకర్త కృష్ణ మాట్లాడుతూ బడీడు పిల్లలు బడులకు వెళ్లేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభ్యులను పిలుపునిచ్చారు. బడీడు పిల్లలను పనులకు పంపితే చర్యలు తప్పవనే విషయాన్ని తెలియ జేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విద్యతోపాటు అన్ని రకాల సౌకర్యాలు అందుతాయని తెలియ జేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్, ఎంవీఎఫ్ సభ్యులు కిస్టోఫర్, నరేశ్, మురళీమోహన్, పుష్ప, మాధవి పాల్గొన్నారు.

91
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles