తెలంగాణకు వరం.. సురవరం


Sun,September 9, 2018 01:18 AM

-ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధ్యక్షుడు ఎస్‌వీ రామారావు
ఉండవెల్లి : తెలంగాణ ప్రజలకు సురవరం ఒక వరంగా నిలిచారని ఆచార్య ఎస్‌వీ రామారావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యయాత్ర కార్యక్రమాన్ని కుటుంబీకులు, తెలంగాణలోని కవులు ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా వక్తలు సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్‌వీ రామారావు మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడిగా పేరు గావించి తెలంగాణ యాస, గోసను ప్రపంచానికి తన రచనల ద్వారా ప్రజలను ఛైతన్యం చేశారు. తెలంగాణలో కవులకు కోదవ లేదని సురవరం ప్రతాపరెడ్డి అనాడే 354 మంది కవులను గుర్తుంచి కవుల సమేళనం నిర్వహించారన్నారు. అలాగే గోల్‌కొండ పత్రికను స్థాపించి దశాబ్ద కాలం సంపాదకుడిగా ఉండి తన సాహిత్యం ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నంచారన్నారు. తన రచనలు వర్తమానం, భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి, పాలుమూరు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్నారు. జాతీయ రహదారి ఇటిక్యాలపాడు స్టేజీలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహా ఏర్పాటుకు కవులు, కుటుంబ సభ్యులు సలహాలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీవేత్తలు వల్లభాపురం జనార్దన్, ఆనంద్ ఆచారి, మోతుకూరి నరహరి, జలజం సత్యనారాయణ, భూపతి వెంకటేశ్వర్లు, మానోహర్‌రెడ్డి, సురవరం కుటుంబీకులు విష్ణువర్ధన్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, పుష్పలత, నరేందర్‌రెడ్డి, లోకేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...