అభివృద్ధే ధ్యేయంగా ..


Sun,September 9, 2018 01:18 AM

-అలంపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం అబ్రహం
-వెంకటసాయి విల్లాస్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం
ఉండవెల్లి : అలంపూర్ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని టీఆర్‌ఎస్ పార్టీ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం అన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని వెంకటసాయి విల్లాస్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే అలంపూర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజల కష్ట, సుఖాలను పంచుకునేందుకు నిత్యం పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అలంపూర్ నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. అందులో భాగంగానే అలంపూర్ నియోజక వర్గంలో అనేక సంక్షేమ పథకాలను ఆమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల జెడ్పీటీసీలు ఖఘన్నాథ్‌రెడ్డి, వేదవతి వరన్నగౌడ్, బొరవెల్లి సత్యారెడ్డి, తనగల సీతారామిరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, నారాయణరెడ్డి, కిశోర్, అల్లాబకాస్, సురేశ్, సుంకన్న, రవి, గుమ్మ గోవర్దన్, భైరాపురం రమణ, మారమునగాల రవి పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...