టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం


Sun,September 9, 2018 01:18 AM

రాజోళి : అలంపూర్ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రాజోళి మండలంలో కూడా వలసల జోరు పెరిగింది. మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం, మండల నాయకులు శ్రీరామ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాన్‌దొడ్డిలో 150 మంది పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి అబ్రహం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా విడుదల అయ్యాయన్నారు. రైతులకు ఎంతో మేలు చేసిన టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అలంపూర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమని ఆయన అన్నారు. ఇంకా మండలంతో పాటు తాలూకాలోని ఆయా గ్రామాల్లో పార్టీలో చేరేవారు భారీగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారామి రెడ్డి, కేటీఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు గజేంద్ర, రైతు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, సుబ్బా రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాముడు, తిరుపాల్ పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...