ప్రచార హోరు..!


Sat,September 8, 2018 02:39 AM

- పథకాలే ప్రచార అస్ర్తాలు
- మొదలైన ఎన్నికల సందడి
- పల్లెల్లో టీఆర్‌ఎస్ శ్రేణుల పర్యటనలు
- బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
- గెలుపించుకునే బాధ్యత తమదేనంటున్నకార్యకర్తలు
- శుక్రవారం ప్రచారం మొదలుపెట్టిన బండ్ల, అబ్రహం
- బేజారవుతున్నప్రతిపక్షాలు
జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : జోగుళాంబ గద్వాల జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు నడిగడ్డ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు సీఎం కేసీఆర్ శంఖరావం పూరించడంతో ఎన్నికల ఆట మొదలైంది. యుద్ధరంగంలోకి గద్వాల టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వల్లూరు మల్లెపోగు అబ్రహంలు అడుగుపెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అంచనాల ప్రకారం అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసి నవంబర్ నెలలో ఎన్నికలను చేపట్టి డిసెంబర్‌లోనే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కప్రణాళికలు చేపట్టారు. ఇందుకోసం 50 రోజుల్లో 100 నియోజవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించి ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘనతను చాటేం దుకు సిద్ధమయ్యారు. శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన తొలి సభలో ప్రతిపక్షాల కుట్రలను, కుతంత్రాలను ప్రజలకు తెలియజేశారు. నాలుగున్నర ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితో జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజవర్గాల్లో టికెట్టు సొంతం చేసుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహంలు విస్తృత స్థాయిలో ప్రచారాలు చేపట్టారు.

బ్రహ్మరథం పడుతున్న జిల్లా ప్రజలు
మొదటిరోజు ప్రచారంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మల్దకల్ మండలంలో ప్రచారం చేపట్టారు. మల్దకల్‌లోని తిమ్మప్ప స్వా మిని సతీసమేతంగా దర్శనం చేసుకొని అనంతరం మండల కేం ద్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను గమనించిన ప్రజలు ఆయనకు బ్రహ్మరథంపట్టి స్వాగతంపలికారు. భారీ మెజారిటీతో గెలిపించేందుకు స బ్బండవర్ణాల ప్రజలమంతా కలికట్టుగా కృషి చేస్తామని నియోజకవర్గ ప్రజలు కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఎవరిని పలకరించినా టీఆర్‌ఎస్ పార్టీకే తమ ఓటని చెబుతుండటంతో కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. యువతకు వెన్నుదన్నుగా ఉంటూ సూచనలు అందిస్తూ గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున కృష్ణమోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. గద్వాల టికెట్టు సొంతం చేసుకున్న కృష్ణమోహన్‌రెడ్డికి జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందలను తెలియజే శారు. అటు అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్టు ఖరారు కావడంతో నియోజకవర్గాల ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. శుక్ర వారం అబ్రహం నియోజకవర్గంలోని బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించు కొని ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాలీగా ఎర్రవెల్లి చౌరస్తా నుంచి అలంపూర్ చౌరస్తా వరకు ప్రచారం నిర్వహించారు. అలంపూర్ నియోజకవర్గంలోని గ్రా మాల్లోని ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. టీఆర్‌ఎస్ పాలనకోసమే తామంతా ఎదురుచూసున్నామని..ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు మాజీ ఎమ్మెల్యే అబ్రహంకు భరోసా అందించారు.

పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి..
టీఆర్‌ఎస్ పార్టీ నాలుగున్నర ఏళ్లపాటు అమలు చేసిన అనేకమైన వినూత్న పథకాలను వివరిస్తూ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రచారాలు కొన సాగాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందుకున్న తల్లిదండ్రులు కేసీఆర్ తమ కుటుంబానికి పెద్దన్నలా మారాడని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆసరా పథకం ద్వారా ప్రతి నెలా పింఛన్‌ను పొందుతున్న వృద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళలు కేసీఆర్ తమ పెద్దకొడుకని హక్కున చేర్చుకుంటున్నా రు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు పెట్టుబడి అందుకున్న రైతులు, రైతు రుణామాఫీలలో రుణాలు మాఫీ చేయించుకునకున్న రైతులు సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువని కొనియా డుతున్నారు. రైతుబీమా ద్వారా తమ కుటుంబాలకు దీమాకు కల్పించిన ఆపద్భాందవుడు కేసీఆర్ అని చెప్పుకుంటున్నారు. కులవృత్తులకు జీ వం పోసేలా గొర్రెల కాపర్లకు గొర్రెలను, మత్య్సకారులకు పరికరాల కు అందించిన కేసీఆర్ తమ తలరాతలను మార్చడని సంతోషం వ్యక్తం చేస్తన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు తుమ్మిళ్ల, నెట్టెంపాడు, గుట్టు ఎత్తిపోతల పథకాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70ఏళ్లలో ఏ ప్రభు త్వం చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసి చూపెడుతుందని ప్రజలే అభినందలను తెలియజేస్తున్నారు.

అక్కున చేర్చుకుంటున్నారు..
ప్రచారంలో మొదట్లోనే ఎన్నో మధుర అనుభూతులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ గద్వాల టిక్కెట్టు కేటాయించిందనందుకు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రచారం కోసం ఇంటింటికీ వెళుతుంటే ఎవరిని కదిపినా... ఎవరి నోట విన్నా సీఎం కేసీఆర్ పేరే వినిపిస్తుంది. నాలుగున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను పాలించి ప్రవేశపెట్టిన అద్భుతమైన వినూత్న పథకాలు ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేశాయి. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలందరి గుండెల్లో కేసీఆర్ గూడు కట్టుకున్నారు. ఈ అభిమానాన్ని, కృతజ్ఞతలను అన్నింటినీ టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి చాటిచెబుతామంటున్నారు. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కార్యకర్తలందరిని కలుపుకొని ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయం సాధిస్తాం.
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల నియోకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి

విశేష స్పందన వస్తుంది
దశాబ్దాలుగా అలంపూర్ నియోజకర్గాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకు న్న పాపానపోలేదు. ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ఆయన చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకం అలంపూర్ నియోజకవర్గ ప్రజల తలరాతలనే మార్చేస్తుంది. టీ ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రజల్లో అశేష వస్తుంది. ప్రచారంలో ప్రజల్లోకి వెళు తుంటే ప్రజలు తాము అందుకున్న సంక్షేమ ఫలాలను గురించి వివరిస్తున్నారు. ఏ నాయకుడు చేయని సహాయాన్ని కేసీఆర్ చేశాడంటూ వేన్నోళ్ల పొగుడు తున్నారు. అడుగడుగునా ప్రజలునీరాజనం పలుకుతుండటంతో కార్యకర్తలు ఉత్సాహంగా మందుకు సాగుతున్నారు.
- వల్లూరు మల్లెపోగు అబ్రహం, అలంపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...