అభివృద్ధిలో ముందుంచుతా

Sat,September 8, 2018 02:34 AM

= దమ్మున్న నేత కాబట్టే ముందస్తు ప్రకటించారు
= ముందస్తు ఎన్నికలతో ప్రతిపక్షాల్లో గుబులు
= సత్తా లేకనే విపక్షాల పొత్తు
= ఏక కాలంలో అభ్యర్థులను ప్రకటించలేక పోతున్నారు
= అలంపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం అబ్రహం
= నేడు పార్టీ కార్యాలయం ప్రారంభం
అలంపూర్, నమస్తే తెలంగాణ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, రానున్న కాలంలో అభివృద్ధిలో ముందుం చుతానని అలంపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం అబ్రహం అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీలో అలంపూరు నియోజక వర్గం నుంచి తనకు సీటు కేటాయించి సీఎం కేసీఆర్ అభయం ఇచ్చారన్నారు. జోగుళాంబ మాత విజయోస్తు అని ఆశీర్వదించిందని చెప్పారు. ఎమ్మెల్యే సీటు కేటాయించిన తర్వాత మొదటి సారిగా ఎమ్మెల్యే అబ్రహం ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరులను దర్శించుకున్నారు. శుక్రవారం అలంపూరు క్షేత్రంలో ఆలయ దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎనలేని ప్రజాదరణ పొందారన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాల కంటే కూడా అధికంగానే ప్రజా అవసరాల నిమిత్తం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అభివృద్ధిని వేగవంతం చేయడానికే ముందస్తు ఎన్నికలకు నగారా మోగించినట్టు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో ఎవరూ ప్రకటించనట్టుగా ఒకే సారి 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నేటి వరకు విపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కూడా జంకుతున్నారన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీతో గెలువలేక ప్రతి పక్షాలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. సత్తా లేకనే పొత్తు పెట్టుకుంటున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ది ఎప్పటికైనా ఒంటరిపోరే నన్నారు. దమ్మున్న నేత కాబట్టే ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ నాయక త్వంలో అలంపూరు అన్ని విధాలా, అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. నేటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలైందన్నారు. నియోజక వర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. అలంపూరు చౌరస్తాలో శనివారం ఉదయం పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రజలపై తనకున్న అపార నమ్మకంతో జోగు ళాంబ జిల్లాలో గులాబీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తనగల సీతారాంరెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడు, జయరాముడు, కిశోర్, బొంకూరు శ్రీనివాసరెడ్డి, బుక్కాపురం నారాయణరెడ్డి, మద్దిలేటి రెడ్డి, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు అశేషంగా ప్రజలు వెంటరాగా పట్టణంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం, చాకలి ఐలమ్మ, స్వామి వివేకానంద తదితరుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles