సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల

Sat,September 8, 2018 02:33 AM

-శ్రీశైలం ఇన్‌ఫ్లో 20,248,అవుట్‌ఫ్లో 86,435 క్యూసెక్కులు
-జూరాల ఇన్‌ఫ్లో 23,000,అవుట్‌ఫ్లో 45,161 క్యూసెక్కులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి/అమ్రాబాద్ రూరల్ : జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 4గంటల జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 20,248 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 86,435 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 882.20 అడుగుల స్థాయిలో చేరుకొని 200.1971 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. తెలంగాణ జెన్‌కో పవర్ హౌస్ నుంచి 35,315 క్యూసెక్కులు నమోదు కాగా ఏపీ పవర్ హౌస్ నుంచి 23,157 క్యూసెక్కులు, హంద్రినివా ప్రాజెక్టు నుంచి 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 24,000 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

జూరాలకు కొనసాగుతున్న వరద
జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం జురాల ఇన్‌ఫ్లో 23,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 45,161 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1,044.980 అడుగుల ఎత్తులో 9.645 టీఎంసీల నీరు నిల్వ ఉం ది. కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కు లు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 910 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్‌హౌస్ ద్వారా 38,483 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు, నెట్టెంపాడు ద్వారా 1500 క్యూస్కెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నా రు. ఎగువనున్న కర్ణాటకలోని ఆల్మట్టి ఇన్‌ఫ్లో23,400క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 23,400 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 22,645 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 21,356 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 9,348 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,129 క్యూసెక్కులు నమోదైంది. సుంకేశుల ఎలాంటి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో నమోదు కాలేదు.

27 అడుగులకు చేరిన కోయిలసాగర్
దేవరకద్ర రూరల్ : జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిలసాగర్ శుక్రవారం సాయంత్రం నాటికి 27.6 అడుగుల వద్ద నీటినిల్వ ఉందని ఈఈ విజయానంద్ తెలిపారు. ప్రాజెక్టులోకి జూరాల కాల్వ నుంచి 630 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కోయిలసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ 9వ తూముకు మరమ్మతులు చేయడంతో నీటి సరఫరాను నిలిపివేశామని, కేవలం కుడికాల్వ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని చెరువులకు, ఆయకట్టుకు విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు నుంచి జిల్లా కేంద్రంతో పాటు, నారాయణపేట, మద్దూర్ మండలాలకు తాగునీటి సరఫరాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రాజెక్టును సందర్శంచడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 19 మంది ఎస్సైల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో ఎక్కువ కాలం వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లకు బదిలీ చేశారు.

ఎస్సై పేరు ప్రస్తుతం పనిచేస్తున్న స్థలం బదిలీస్థానం

ఎ. వెంకటేశ్వర్లు మరికల్ పీఎస్ దేవరకద్ర పీఎస్
బి. అశోక్ కుమార్ దేవరకద్ర మక్తల్ పీఎస్
ఎం.మధూసుదన్‌గౌడ్ మహబూబ్‌నగర్ మూసాపేట్
వి. సతీష్ మహబూబ్‌నగర్ అడ్డాకల్
పి.నాగశేఖర్‌రెడ్డి వనపర్తి గద్వాల్‌టౌన్
ఎం.రాములు గద్వాల్‌టౌన్ ధరూర్
ఎస్. రాఘవేందర్‌రెడ్డి వనపర్తి వనపర్తి రూరల్
ఎం. పర్వతాల్ మానవపాడు భూత్పూర్
టి. శ్రీనివాస్ వీఆర్, నాగర్‌కర్నూల్ గట్టుపిఎస్
ఎస్. కృష్ణయ్య తాండుర్ కేటీ దొడ్డి
ఎం. నర్సింములు వీఆర్, నాగర్‌కర్నూల్ కల్వకుర్తి ఎస్సై-1
వీ. ప్రదీప్ కుమార్ బిజినేపల్లి వంగూర్
సీహెచ్. బాలకృష్ణ ఊర్కొండ చారకొండ
పి. వీరాబాబు సీసీఎస్, నాగర్‌కర్నూల్ వెల్దండ
పి.గురుస్వామి డీఎస్పీ,నాగర్‌కర్నూల్ అయిజ
కె. శ్రీనివాస్ వంగూర్ అమ్రాబాద్
ఎం. రామామూర్తి వెల్దండ పీఎస్ వీఆర్ గద్వాల్
వై. భాగ్యలక్ష్మీరెడ్డి కేటీదొడి వనపర్తి టౌన్
సీహెచ్. రాజు ఆత్మకూర్ మానవపాడు

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles