ఎల మంద హాసం !

Fri,September 7, 2018 03:03 AM

-సబ్సిడీ గొర్రెల పంపిణీతో యాదవులకు మంచిరోజులు
-జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంపిణీ
-ఇప్పటికే 500 యూనిట్ల అందజేత
-ఈసారి 31 వేల యూనిట్లు లక్ష్యం
-సంబురపడుతున్న గొల్లకుర్మలు

జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగా ణ ప్రతినిధి : ప్రభుత్వం అందించిన గొర్రెలతో కాపర్ల జీవితం మారిపోయిం ది. జీవనోపాధి లేక హైదరాబాద్, బెం గుళూరు నగరాలకు వలసలు పోయే గొర్రెల కాపర్లు ఇప్పడు తమ గ్రామంలో నే ఆర్థిక సంపదను సృష్టిస్తున్నారు. దా దాపుగా అంతరించి పోతుందనుకున్న కాపరుల వృత్తి తెలంగాణ ప్రభుత్వం చొరవతో మళ్లీ జీవం పోసుకుంటుంది. గొర్రెల కాపర్లకు సబ్సిడీ గొర్రెలను అ ందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారాలను చేపట్టి రెండో విడతల్లో పం పిణీ చేసేందుకు 2017 జూన్ 20న ఈ పథకాన్ని మొదలుపెట్టారు. 18ఏళ్ల దా టిన ప్రతి ఒక్కరి సబ్సిడీ గొర్రెలను అంది స్తామని 182 సొసైటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మొదటి విడతలో దరఖాస్తులు చేసుకున్న లబ్ద్ధిదారులకు లక్కి డ్రిప్ ద్వారా ఎంపిక చేసి పారదర్శకంగా గొర్రెలను అందించారు. ఇదే స్ఫూర్తితో రెండో విడతలో కూడా గొర్రెలను అందించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు.

పారదర్శకంగా పంపిణీ

గ్రామీణ ప్రాంతాలలో శాశ్వతంగా పేదరికాన్ని పారద్రోలాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం గొర్రెల కాపర్ల వృత్తిదారులకు ప్రత్యేకంగా పథకాలను రూపొందిచారు. జిల్లాలోని 182 సొసైటీల ద్వా రా మొదటి విడతలో10,444 గొర్రెల పంపిణీ చేయగా వాటి ద్వారా ఏడాదికాలంలో దాదాపుగా 60లక్షల గొర్రెల సంపదను సృ ష్టించినట్టుగా అధికారులు తెలిపారు. గతేడాది దరఖాస్తు చేస్తున్న బి కేటగిరిలోని 10,720 యూనిట్లకు తోడుగా మరో 20వేల యూనిట్లను అదనంగా పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో విడతలోమొత్తం 31వేల యూ నిట్ల గొర్రెలను అందించడమే లక్ష్యంగా ముందుగు సాగుతున్నారు. ఇప్పటి వర కు జిల్లా వ్యాప్తంగా 500యూనిట్లను లబ్ధిదారులకు పశసంవర్థక శాఖ అధికారులు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ కు ప్రభుత్వం రూ.1లక్షా 25వేలు ఖర్చు అవుతుండగా ఇందులో 75శాతాన్ని ప్ర భుత్వమే భరిస్తుంది. లక్కి డ్రిప్‌లో పేరు వచ్చిన లబ్ధిదారులు 25శాతం డబ్బుల ను చెల్లించి గొర్రెలను పొందారు. ఒక్కొ క్కరికి ఒక యూనిట్ చొప్పున 20గొర్రె లను, ఒక పొట్టెలును అందించారు. ఇత ర రాష్ర్టాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అంది స్త్తున్నారు.

మొదటి విడతలో అందించిన గొర్రెల యూనిట్లు

మొదటి విడతలో 10,444 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు టార్గెట్ నిర్ణయించుకోగా నూటికి నూరు శాతం వాటిని అమలు పరిచారు. జిల్లాలోని 12మండలాల వారీగా అం దించిన గొర్రెలల్లో గద్వాలలో 1,067 యూనిట్లు, గట్టులో 457 యూనిట్లు, కేటీదొడ్డిలో 691యూనిట్లు, ధరూర్‌లో 948 యూనిట్లు, మల్దకల్‌లో 760 యూనిట్లు, అలంపూర్‌లో 784 యూని ట్లు, అయిజలో 953 యూనిట్లు, వడ్డేపల్లిలో 1,225 యూనిట్లు, రాజోళిలో 262 యూనిట్లు, ఇటిక్యాలలో 1652 యూనిట్లు, మానవపాడులో 917యూనిట్లు ఉండవెల్లిలో 728 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.

రెండో విడత ప్రారంభించాం

ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు 450 యూనిట్ల గొర్రెల జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పంపిణీ చేశాం. రెండో విడతలో 31వేల యూ నిట్ల గొర్రెలను పంపిణీ చేసేందుకు ల క్ష్యం విధించుకున్నాం. ప్రభుత్వ బడ్జెట్ విడుదలైన వెంటనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. లబ్ధిదారులకు కావాల్సిన గొర్రెలను ఇతర రా ష్ర్టాల నుంచి కొనుగొలు చేసి అందిస్తాం.
-ఆదిత్య కేశవసాయి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

108
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles