శరవేగంగా సమీకృత కలెక్టరేట్

Sat,June 23, 2018 01:48 AM

-రూ.55.08 కోట్లతో నిర్మాణం
-మొదటి విడతగా రూ.30 కోట్లు
-4 బ్లాకుల్లో ఫిల్ట్ భీమ్ పనులు
-42 ఎకరాల్లో నిర్మాణ పనులు
-ఆధునిక హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు
-గడువులోగా పూర్తవనున్న నిర్మాణాలు
జోగుళాంబ గద్వాల, నమస్తేతెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పాటైన తర్వాత ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో జి ల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయా లు ఒకే చోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. జో గుళాంబ గద్వాల జి ల్లా ఏర్పడ్డ సరిగ్గా ఏడాది నాటికి నూతన కలెక్టరేట్, పో లీస్ భవనాలకు మంత్రి లకా్ష్మరెడ్డి శంకుస్థాపన చేశారు. గతేడాది అక్టోబర్ 11న ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతు న్నా యి. ప్రస్తుతం 4 బ్లాక్‌ల పనులు నడుస్తుండగా వీటిలో 3 బ్లాకుల్లో ఫిల్ట్‌భీ మ్ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏ డాదిలోగా పనులను పూర్తి చేసేందు కు అధికారుల అన్ని చర్య లు చేపడుతున్నారు.

జిల్లా కేంద్రంలో నిర్మాణమవుతున్న కొత్త కలెక్టరేట్, పోలీసు భవన సముదా య నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో పీజేపీ కార్యాలయం ఆవరణలోని సు మారు 42 ఎకరా ల విస్తీర్ణంలో ఈ ప నులు చేపట్టారు. వీటి లో దాదాపు 25.5 ఎకరాల్లో కలెక్టరేట్ ని ర్మాణం, 16.5ఎకరాల్లో పోలీసు భవనాల స ముదాయం పనులు కొనసాగుతున్నా యి. జిల్లా అర్‌అండ్‌బీ అధికా రులు ఈ పనుల పర్యవేక్షణను చేపట్టి ప్రభు త్వం విధించిన గడువులోపు పూర్తి చే సేందుకు అన్ని చర్యలు చేపడుతున్నా రు. ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 55.08 కోట్లను కేటాయించింది.

పూర్తయిన ఫిల్ట్ భీమ్‌లు
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం లో ప్రస్తుతం మొదటి విడతలో 4బ్లా క్‌ల పనులు చేపట్టారు. వీటిలో 3 బ్లాకుల్లో ఫిల్ట్ బీమ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక బ్లాక్‌లో పను లు జరుగుతున్నాయి. వీటితో పాటు స్లాబ్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. రోజుకు 8 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగు తున్నాయి. మొదటి విడత పనుల కోసం కలెక్టరేట్ సమీకృత భవనానికి రూ.30 కో ట్లు, పోలీసు సముదాయాల భవనం కోసం రూ.11 కోట్లను మొత్తం రూ. 41 కోట్లను ప్రభుత్వం మంజూరు చే సింది. వీటిలో కలెక్టరేట్ భవ సము దాయాల్లో కలెక్టరేట్, జేసీ, డీఆర్వో, డీఎల్‌వోతో పాటు ఏ,బీ,సీ,డీ బ్లాక్‌ల కార్యా యాలను చేపడుతున్నారు. ఈ కార్యాలయాల ప్రాంగంణలో పార్కిం గ్ కోసం 2.5 ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమావేశాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా సమావేశ మందిరాన్ని ఏర్పా టు చేస్తున్నారు. వీటి పరిసరాల్లో సోలార్ పవర్‌ప్లాంట్, తాగునీటి కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మిస్తున్నారు. కార్యాలయంలో ట్రాఫిక్ స మస్యలు తలెత్తకుండా నాలుగు లైన్ల రోడ్డును కూడా నిర్మించనున్నారు.

184
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles