టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలతో..ప్రతిపక్షాలు గల్లంతు

Sat,June 23, 2018 01:47 AM

-గట్టు ఎత్తిపోతలతో రైతుల కష్టాలు దూరం
-టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-రాయాపురంలో కాంగ్రెస్ నాయకుల చేరిక
గట్టు : టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల ఉనికి గల్లంతు కానున్నదని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గట్టు ఎత్తిపోతల పథకం మంజూరైన సందర్భంగా మండలంలోని రాయాపురంలో స్థానిక సర్పంచ్ సురేఖ నర్సింహులు ఆధ్వర్యంలో గురువారం రాత్రి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ధూంధాం అందరినీ ఆకట్టుకుంది. కళాకారుల ఆటపాటలు హుషారెత్తించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన సందెరాళ్ల తిమ్మప్ప, బందాయల నర్సింహులు, బందెన్న, రంగస్వామి, పూజారి వెంకటేశ్, గడ్డంతాత నర్సింహులు, ఆనంద్, టైలర్ కృష్ణ, పూజారి శివ, రాముడు, తిరుమలేశ్ కంబయ్య, సవరప్పతోపాటు మరో ముప్పై మంది దాకా టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన సమైక్యాంధ్ర పాలకులు చేసిన అభివృద్ధి ఏమీలేదని ఎద్దేవ చేశారు. తమ స్వార్థం చూశారే తప్ప, ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచే తెలంగాణ అభివృద్ధిని పట్టించుకుందన్నారు. గట్టు ఎత్తిపోతలతో ఉమ్మడి గట్టు రైతుల కష్టాలు ఇక దూరం కానున్నాయన్నారు. రాబోయే రోజుల్లో గట్టు కోనసీమగా మారి రైతులు ఆర్థికంగా ఎదుగనున్నారనే భరోసాను కృష్ణమోహన్‌రెడ్డి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిని చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు ఓట్లు అడగడానికి వస్తే ఏం చేశారని మీకు ఓట్లెయ్యాలని ప్రశ్నించి తిప్పిపంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్, చింతలకుంట సర్పంచ్ రాజశేఖర్, కేటీదొడ్డి సర్పంచ్ ఉరుకుందు, టీఆర్‌ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, గద్వాల తిమ్మప్ప, మొద్దు భీమన్న, బజారప్ప, నర్సింహులు, కర్రెప్ప, పాగుంటప్ప, వెంకటేశ్, మారెప్ప, మహదేవప్ప, గోవిందు, సిద్ధూ, రంగస్వామి, తిమ్మప్ప పాల్గొన్నారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles