అక్రమంగా తరలిస్తున్న డ్రిప్ పైపులు పట్టివేత


Fri,June 22, 2018 02:21 AM

-ఇద్దరు రైతులు, వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు
ధరూర్ : సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద రైతులు ఇచ్చిన బిందు సేద్యం పైపులను అక్రమంగా ఇతర రైతులకు అమ్మి తరలిస్తున్న క్రమంలో రేవులపల్లి పోలీసులకు పట్టుబడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మురళీగౌడ్ కథకం ప్రకారంగా ధరూర్ మండల కేంద్రానికి చెందిన సత్యన్న తనకు రాయితీపై వచ్చిన బిందు సేద్యం పైపుల చుట్టల బండిల్స్‌ని అక్రమంగా అమరచింత మండలం మస్తీపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు అమ్ముకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జూరాల ప్రాజెక్టు మీదుగా మస్తీపూర్‌కు ఏపీ 22 ఎక్స్ 7676 బొలేరో వాహనంలో తరలిస్తుండగా వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాయి. విచారించిన పోలీసులు అక్రమ వ్యవహారం అని తేలింది. అమ్మిన రైతును, కొనుగోలు చేసిన రైతును విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. 16 పైపుల బండిల్స్‌ను రూ.22 వేలకు అమ్ముకున్నట్లు విచారణలో తేలడంతో కేసు నమోదు చేశారు. డ్రైవర్ అంజి, అమ్మిన, కొన్న రైతులు సత్యన్న, శ్రీకాంత్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మురళీగౌడ్ తెలిపారు. రాయితీ డ్రిప్ పరికరాలు కొన్నా, అమ్మినా, తరలించిన వాహనాలు, డ్రైవర్లపై కూడా కేసులు తప్పవని ఎస్‌ఐ చెప్పారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...