బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

Wed,June 20, 2018 02:05 AM

ధరూర్ /గద్వాల అర్బన్ : ధరూర్ మండలంలో పలు గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, విద్యార్థులు, గ్రామస్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని జై నడిగడ్డ యువత సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలోని నెట్టెంపాడు, నాగర్‌దొడ్డి, ద్యాగదొడ్డి, గుడ్డందొడ్డి, ఉప్పేరు గ్రామాల మీదుగా నడిచే నెట్టెంపాడు బస్సును రెగ్యులర్‌గా అన్ని రోజుల్లో నడిపించాలన్నారు. అలాగే గార్లపాడు, ఖమ్మంపాడు, గువ్వలదిన్నె గ్రామాలకూ బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రతి రోజూ నాలుగైదు కిలో మీటర్ల దూరం నడిచి పాఠశాలకు చేరుకుంటున్నారన్నారు. గ్రామస్తు లు ప్రమాదభరితంగా ప్రైవేటు వాహనాల ను ఆశ్రయిస్తున్నారని వినతి పత్రంలో పే ర్కొన్నారు. మేనేజర్ స్పందిస్తూ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కురువ భాస్కర్, నరహరి, లక్ష్మీకాంత్‌గౌడ్, తిరుమలాచారి, గోపాల్‌నాయుడు, తిరుమల్, గట్టన్నతో పాటు 50 మంది యువకులు పాల్గొన్నారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles