సీఎం పర్యటన పనులు వేగవంతం


Wed,June 20, 2018 02:05 AM

-పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభం
-హెలిప్యాడ్ స్థలాన్ని సిద్ధం చేయనున్న ఆర్‌అండ్‌బీ శాఖ
-సీఎం గట్టు పర్యటనను విజయవంతం చేయాలి
-టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గట్టు : గట్టు ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేసే నిమిత్తం సీఎం కేసీఆర్ 24వ తేదీ ఆదివారం గట్టుకు రానున్న నేపథ్యంలో రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతం పెంచికలపాడు స్టేజీ సమీపంలో పనులు చకాచకా సాగుతున్నాయి. రిజర్వాయర్‌తో సంబంధం లేకుండా ఎత్తు ప్రాంతంలో పైలాన్ నిర్మించే పనులను ప్రారంభం చేశారు. ఈ పనిని గడువులోపే పూర్తి చేయాలని సంకల్పించారు. అదేవిధంగా సీఎం పైలాన్‌ను ఆవిష్కరించే సమయంలో అక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ ప్రాంత భూమినంతా చదును చేస్తున్నారు. పైలాన్‌ను కొంత దూరంలోనే హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని చూశారు. అయితే స్థలం ఎంపిక మాత్రం కాలేదు. రేపు ఇందుకు సంబంధించిన పనులు మొదలవుతాయని చెబుతున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఇదిలావుండగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం సందర్శించి పనులను సమీక్షించారు. పనులను వీలైనంత వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం గట్టులో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం గట్టు పర్యటనతోపాటు గద్వాల బహిరంగ సభను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. బహిరంగ సభకు జన సమీకరణ లక్ష దాకా ఉండాలని స్పష్టం చేశారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...