జము లమ్మ ఆలయంలో పూజలు

Wed,June 20, 2018 02:03 AM

గద్వాల రూరల్: నడిగడ్డ ఇలవెల్పు జమ్మిచేడు జములమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అమ్మవారికి నైవేధ్యం సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరు గకుం డా, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులు వారి వా హనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో, పార్కింగ్ చేయాలని సూచించారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది అన్ని వసతులు కల్పించారు. ఆలయ పరిసరాల్లో చెత్తచెదారం వెయకుండా, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ శ్రీరాములు, ఈవో పురేందర్, ఆలయ పాలక వర్గ సభ్యులు గుర్రంగడ్డ భాస్కర్‌రెడ్డి, వెంకటన్న, పుటాన్‌పల్లి లక్ష్మన్, కాజన్న, చిన్నఆంజ నేయులు, బీచుపల్లి,మహేశ్వరి,బీమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles