తెరుచుకున్న కొత్తపలెం బడి

Tue,June 19, 2018 02:03 AM

-తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో ఫలించిన చర్చలు
-ఎంఈవో హామీతో తల్లిదండ్రులఆందోళన విరమణ
ధరూర్ : కొత్త పాలెం ప్రాథమికోన్నత పాఠశాల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన అనంతరం స్థానిక పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ వారం రోజులుగా తరగతులను బహిష్కరించి, ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు ఎట్టకేలకు మెట్టు దిగారు. ప్రజా సంఘాల నాయకులు, అఖిల పక్షం కమిటీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు విద్యాధికారితో సోమవారం పాఠశాల ఆవరణలో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత, ఇతర సమస్యలను ఎంఈవో వివరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ కొత్తపాలెం పాఠశాలకు నాలుగు పోస్టులు మంజూరు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యాబోధన కష్టతరం అయినందునే ప్రతి యేటా ముగ్గురు వాలంటీర్ల నియామకంతో నెట్టుకొచ్చామన్నారు. తల్లిదండ్రుల వాదన సహేతుకమేనని, విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, పాఠశాలకు పూర్తి స్థాయిలో ఎనిమిది పోస్టుల కోసం ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆందోళన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. తల్లిదండ్రులు సహకరించి, పాఠశాలలో తరగతుల ప్రారంభానికి సహకరించాలని కోరారు. విద్యాధికారి హామీతో ప్రస్తుతం ఆందోళనను విరమిస్తున్నామన్నారు. అఖిల పక్షం నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ కేవలం ఈ సమస్య కొత్త పాలెం పాఠశాలకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. జిల్లాలో చాలా పాఠశాలలో ఈ సమస్య ఉన్నదని, ప్రభుత్వం దృష్టి సారించి రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం నాయకులు అతిక్ రహమన్, ధరూర్ రవి, ఉప్పేరు సుభాన్, ఎంవీఎఫ్ ప్రతినిధి హన్మిరెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షి శంకర్ నాయక్, జై న డిగడ్డ యువత స భ్యులు పాల్గొన్నారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles