పరిసరాల పరిశుభ్రతకు చర్యలు


Tue,June 19, 2018 02:02 AM

-కమిషనర్ త్రయంబకేశ్వర్‌రావు
-పట్టణంలో పరిశీలన
అయిజ : పట్టణంలోని పరిసరాల పరిశుభ్రతకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు కమిషనర్ త్రయంబకేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం పురపాలక పరిధిలోని పలు వార్డులలో పర్యటించి పారిశుధ్య పనులను కమిషనర్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చే శారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ను విచ్చల విడిగా వాడకంతో పట్టణంలోని డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు నిండిపోతున్నాయన్నారు. దీంతో డ్రైనేజీలలో మురుగు నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పో తుందని పేర్కొన్నారు. ప్రజలు చెత్తను పరిసరాలలో పడవేయకుండా చెత్త బుట్టలలో నిల్వ చేసి, రిక్షాలలో వేస్తే ఊరి బయటకు తరలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పట్టణంలో చెత్త చెదారంతో నిండిన డ్రైనేజీలను శుభ్రపర్చడంతో పాటు చెత్తను తరలిస్తున్నట్లుకమిషనర్‌పేర్కొన్నారు. కార్యక్రమంలోపారిశుధ్యసిబ్బందిపాల్గొన్నారు.
డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి
పురపాలికలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం నాయకులు కమిషనర్ త్రయంబకేశ్వర్‌రావును కోరారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.పురపాలికలో డంపింగ్ యార్డు లేకపోవడంతో సిబ్బంది ఇంటింటికీ సేకరించిన చెత్తను పట్టణం నడిబొడ్డున ఉన్న వాగులో డంపింగ్ చేస్తుండటంతో వర్షాలకు వాగులో నీరు ప్రవహిస్తే ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. పట్టణంలోని డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో పాటు చెత్తను సేకరించేందుకు రిక్షాల స్థానంలో ఆటోలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సమీర్, వాహీద్, దౌలత్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...