రాష్ట్రం దాటుతున్న.. రేషన్ బియ్యం


Mon,June 18, 2018 02:21 AM

గద్వాల అర్బన్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ముఠాలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే అధికారులు స్పెషల్ ఆపరేషన్ ద్వారా రేషన్ బియ్యంపై నిఘా పెట్టినా.. వారి కన్నుగప్పి అక్రమంగా పక్క రాష్ర్టాలకు తరలిస్తున్నారు. జిల్లా పరిధిలో ఇప్పటికే భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీస్‌లు దాడులు చేసి పట్టుకున్నారు. దీంతో బియ్యాన్ని తరలించే కొన్ని ముఠాలు కొత్త మార్గాలను అన్వేషించాయి. ఆ మార్గాల వెంట సాగేందుకు ప్రయత్నం చేసుకుంటున్నాయి.

చిన్న మొత్తాలుగా బియ్యం సేకరణ..
రేషన్ బియ్యాన్ని చిన్న మొత్తాల్లో సేకరించడం, వాటిని నిర్ణీత ప్రాంతానికి చేర్చేందుకు దళారీలు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఏజెంట్లు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కిలో రూ.8, 9లకు కొనుగోలు చేసి అంతా ఒక దగ్గరకు చేర్చుతున్నారు. వారి ద్వారా సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు, పక్క రాష్ర్టాలకు చేరుస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అంతా ఒక చోటకు చేర్చేందుకు రెండు, మూడు దశల్లో వ్యవహారాన్ని రూపొందించుకుంటున్నారు. ఇందులో కొంత మంది రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూ భాగస్వాములవుతున్నారు. తర్వాత లబ్ధిపొందిన లబ్ధిదారుల నుంచి సేకరించేందుకు ఏజెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరు సేకరించిన బియ్యాన్ని వ్యాపారులకు ఇస్తారు. వారు మళ్లీ మధ్యవర్తుల ద్వారా మిల్లర్లకు, పక్క రాష్ర్టాలకు చేరవేస్తున్నారు. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో 25, 30, 40, 50 కేజీల బ్యాగుల్లో రహస్యంగా చేరవేస్తున్నారు. ఇలా కొద్దికొద్దిగా బియ్యాన్ని కుప్ప చేసి భారీ మొత్తంలో తరలించి అధిక మొత్తంలో ధనార్జనకు బాటలు వేసుకుంటున్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...