వ్రిద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి


Sun,June 17, 2018 02:19 AM

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ : ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని నిజామాబాద్ సర్కిల్‌లో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈనెల 15లోపు బదిలీలను పూర్తి చేయాలని సర్కిల్ ఎస్‌ఈలకు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఏఈవోలు, సీనియర్ అసిసెంట్లు, జూనియర్ అసిసెంట్లు, సబ్ ఇంజినీర్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు, ఫోర్‌మెన్లను బదిలీ చేశారు. సర్కిల్ ఎస్‌ఈ ప్రభాకర్ చైర్మన్‌గా, డీఈ టెక్నికల్ ముక్తార్, ఎస్‌ఏవో జయరాజ్ నేతృత్వంలో రెండు జిల్లాల పరిధిలో ఉద్యోగుల బదిలీలు నిర్వహించారు. ఏఈ కంటే పైస్థాయిలో ఉన్న ఉద్యోగులను సీఎండీ పరిధిలో ఏడీఈ, డీఈ, ఎస్‌ఈలను బదిలీ చేశారు. విద్యుత్ శాఖలో మూడేళ్ల సర్వీసు దాటిన వారిని కచ్చితంగా బదిలీ చేసేందుకు కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 51 మంది ఏఈలు, 4 ఏడీఈలు , 48 మంది సీనియర్ అసిసెంట్లు, 69 జూనియర్ అసిసెంట్లు, 18 మంది సబ్ ఇంజినీర్లు, 10 మంది జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు, 7 మంది ఫోర్‌మెన్లు, 5 రికార్డు అసిస్టెంట్లు , 16 మంది ఆఫీస్ సబార్డినేట్లకు స్థాన చలనం కలిగించామని ఎస్‌ఈ ప్రభాకర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల పోకల్ పాయింట్లను పరిగణలోకి తీసుకుని బదిలీ ప్రక్రియను ముగించామన్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 71 మంది లైన్‌మెన్లు, ఏడుగురు జూనియర్ లైన్‌మెన్లు, 16 మంది లైన్ ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేసినట్లు డీఈ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 43 మంది లైన్‌మెన్లు, ఇద్దరు జేఎల్‌ఎంలు, 7 లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు వాచ్‌మెన్ల సీనియార్టీ నిర్ణీత సమయం దాటడంతో వారిని బదిలీ చేశామని ఆర్మూర్ డీఈ సాల్యా నాయక్ తెలిపారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...