టీబీ డ్యాంకు భారీగా వరద


Sun,June 17, 2018 02:17 AM

-అంతకంతకు పెరుగుతున్న నీటి మట్టం
-52,136 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-ఎగువన కురుస్తున్న వానలకు తుంగ, భద్ర నదుల నుంచి భారీ వరద
-16.381 టీఎంసీల నీటి నిల్వ
అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. శనివారం కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టాలకు చేరుకోవడంతో ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యాంలోకి 52,136 కూసెక్కుల వరద నీరు టీబీ డ్యాంలోకి వచ్చి చేరుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం, 1633 అడుగుల నీటి మట్టం కలిగిన టీబీ డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగ ప్రాజెక్టు నుంచి 8,218 క్యూసెక్కులు, భద్ర ప్రాజెక్టు నుంచి 43,918 క్యూసెక్కుల నీరు టీబీ డ్యాంలోకి వచ్చి చేరుతోంది. ఎగువన వానలు సమృద్ధిగా కురుస్తుండటంతో టీబీ డ్యాంకు మరింత వరద నీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయని డ్యాం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలోకి 52,136 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 160 క్యూసెక్కులు నమోదైంది. 1597.19 అడుగుల నీటి మట్టం ఉండగా, 16.381 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ వెల్లడించారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...