మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి


Sun,June 17, 2018 02:17 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే గద్వాల ఈద్గా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.25 కోట్లు నిధులు మంజూరు చేసిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని గద్వాల పట్టణంలోని ఈద్గాతో పాటు గద్వాల మండలంలోని గోన్‌పాడు గ్రామంలో ఉన్న మజీద్‌ల దగ్గర గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీపీ సుభాన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పేద ముస్లింల కోసం షాదీ ముభారక్ ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుందన్నారు. మైనార్టీలకు పాఠశాలలు స్థాపించాడని చెప్పారు. ఇతరులను గౌరవించడం, పవిత్రమైన జీవితాన్ని గడపడం అందరి విశ్వాసాలు గౌరవాలను కాపాడేలా ఈద్-ఉల్-ఫిత్ ముస్లింలతో ప్రతిజ్ఞ చేయిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గోన్‌పాడ్‌లో మజీద్ నిర్మాణానికి కృష్ణమోహన్‌రెడ్డి రూ.లక్ష విరాళం, ఎంపీపీ సుభాన్ రూ.50 వేలు ప్రకటించారు. గద్వాలలో ఈద్గా అభివృద్ధికి మార్కెట్ కమిటీ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ రూ.లక్షను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందియడంతో పాటు సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు గట్టుతిమ్మప్ప, బలిగేర నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహులు, నజీర్, విజయ్, మధు, లక్ష్మణ్, బీచుపల్లి పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...