టార్గెట్ జూలై


Fri,February 23, 2018 03:23 AM

-8.28 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సిందే..
-నిర్మాణ పనుల మందగింపుపై మంత్రి హరీశ్ సీరియస్
-క్షేత్ర స్థాయి పరిశీలన కోసం నేడు జిల్లాకు..
-కొల్లాపూర్‌లో రాత్రి బస
-వేగవంతంపై చిగురిస్తున్న ఆశలు

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సమైక్యపాలనలో పెండింగ్‌లో పడేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నాలుగు ప్రధాన ప్రాజెక్టులను వచ్చే వానాకాలం సీజన్ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటు న్నారు. ఎంజీకేఎల్‌ఐతోపాటు భీమా, నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న పెండింగ్ పనులకు సంబంధించి ఇక ఎంత మాత్రం ఉపేక్షేంచేదిలేదంటూ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష లో ఆయా ఏజెన్సీలను మంత్రి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే వానాకాలం సీజన్ వరకు ఈ నాలుగు పెం డింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు పారించేందుకు మంత్రి ప్రత్యేక చొరవను తీసుకుంటున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కార్యచరణ తీసుకుంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా ఇక్కడి ప్రాజెక్టుల పనులపై తరచు పర్యవేక్షణలు జరిపి ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీరందించారు.ఎంజీకేఎల్‌ఐ ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, భీమా ద్వారా లక్ష ఎకరాలు,నెట్టెంపాడ్ ద్వారా లక్ష ఎకరాలు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా 20 వేల ఎకరాలకు ఈ రెండేళ్లలో సాగునీరు అందించ గలిగారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. సాంకేతిక పనులన్నీ సమైక్యపాలనలో వదిలి వేయడంతో మంత్రి వెంటపడి పర్యవేక్షణ చేయడం ద్వారా ఈమేరకు నేడు కరువు ప్రాంతమైన పాలమూరుకు సాగునీరందుతుంది. ఇదే క్రమంలో పూర్తి ఆయకట్టుకు కూడా సాగునీరందించేందుకు ఇప్పటికే అనేక దఫాలుగా సమీక్షలు, పర్యవేక్షణలు చేసిన మంత్రి హరీశ్ రావు పెండింగ్ పనులపై మరింత వేగాన్ని పెంచబోతున్నారు.

పెండింగ్‌లో చివరి దశ పనులు..
ఉమ్మడి పాలమూరులోని నాలుగు ప్రధాన ప్రాజెక్టుల్లో చివరి దశ పనులు పెండింగ్‌లోఉన్నాయి.12 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ ప్రాజెక్టుల్లో సమైక్యపాలకులు 90 శాతం పనులు చేశామని ప్రచారం చేశారు తప్పా పనులు చేయలేదు. రాష్ట్ర సాధనతోనే గత మూడేళ్లుగా మంత్రి హరీశ్ రావు తీసుకున్న చొరవ ఇంతా అంతా కాదు. గతంలో ఏ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ప్రాజెక్టుల దగ్గరకు వచ్చిన వారే లేరు. అలాంటిది ఏకంగా రాత్రి బసలు కూడా ప్రాజెక్టు పనుల దగ్గర చేసి పనుల వేగవంతానికి మంత్రి కృషి చేసిన సంగతి విధితమే. ఇదిలా ఉంటే, ప్రధానంగా ఎంజీకేఎల్‌ఐలో 20 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే భీమా, నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో పది శాతం పనులు మిగిలి ఉన్నాయి. వీటిలో ఎంజీకేఎల్‌ఐకి వెయ్యి కోట్లు, భీమాకు 240 కోట్లు, నెట్టెంపాడ్‌కు 220 కోట్లు, కోయిల్‌సాగర్‌కు 60 కోట్ల రూపాయలతో పనులు చేయించాల్సి ఉంది. వీటన్నిటిలో ప్రధాన సమ స్యలపై దృష్టి నిలిపిన మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ఆయా ఏజె న్సీలతో సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

జూలై వరకు డెడ్‌లైన్..
నాలుగు ప్రధాన ప్రాజెక్టుల పెండింగ్ పనులకు వచ్చే జూలై నెలను మంత్రి హరీశ్ రావు డెడ్‌లైన్ పెట్టారు. పనులపై నిర్లక్ష్యం చేస్తున్న ఏజెన్సీలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇక పనులను ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాకమ్మ కబుర్లు చెబితే ఏజెన్సీలను తొలగించి కొత్త ఏజెన్సీలకు పనులను అప్పగించేందుకు కూడా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుకు 4896 కోట్ల రూపాయల ప్రతిపాదనలుంటే, 3800 కోట్ల రూపాయల పనులను పూర్తి చేసి డబ్బులు చెల్లించారు. అలాగే నెట్టెంపాడ్ ప్రాజెక్టుకు 2331 కోట్ల రూపాయలకు గాను, 2114 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇక భీమా ప్రాజెక్టులో 2509 కోట్ల రూపాయలకు, 2272 కోట్ల రూపాయల పనులు జరిపించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 581 కో ట్లకు గాను 525 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులను చేపట్టారు.

ఇక చివరగా మిగిలిన పనులను సహితం జూలై వరకు పూర్తి చేయాలన్న పట్టుదలతో మంత్రి హరీశ్ రావు ప్రధానంగా దృష్టి పెట్టారు.గడిచిన రెండేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు చొరవ ఫలితంగా జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డిల కృషితో నాలుగు ప్రాజెక్టుల ద్వారా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు.

మంత్రి హరీశ్ రావు రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కార్యక్రమం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 8గంటలకు నాగర్‌కర్నూల్ చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్‌లో ప్రాజెక్టుల భూసేకరణ, ఇసుక రీచ్‌ల సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 11.15 గంటలకు కొల్లాపూర్‌లోని ఎంజీకేఎల్‌ఐ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. అలాగే శనివారం ఉదయం 9గంటలకు వీపనగండ్ల, 10 గంటలకు పాన్‌గల్ మండల కేంద్రాల్లో నూతన మార్కెట్ గోదాంలను మంత్రి హరీశ్ రావు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దమందడి మండలం బలిజపల్లిలో నూతన శిరిడిసాయి ఆలయాన్ని మంత్రి హరీశ్ రావు సందర్శిస్తారు. అక్కడి నుండి తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నట్లు సమాచారం.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...