నివేదనపై అవగాహన కల్పించాలి


Fri,February 23, 2018 03:21 AM

మల్దకల్ : మండలంలోని ప్రతి గ్రామం లో ఉపాధి కూలీలకు నివేదన యాప్‌పై అవగాహన కల్పించాలని, అలాగే పనులు చేపట్టేచోట తప్పకుండా బోర్డును ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ సిబ్బందిని ఏపీడీ నాగేంద్రాచారి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశపు హాలులో ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ నాగేంద్రాచారి మాట్లాడుతూ.. 2018-19 సంవత్సరానికి ఉపాధి హామీ పనులను గుర్తించాలన్నారు. గుర్తించిన వాటిని వెంటనే కంప్యూటర్లలో నమోదు చేయాలన్నారు. వాటి మంజూరు కోసం పంపించాలని సిబ్బందికి సూచించారు. మంజూరైన పనులకు వెం టనే పనులు మొదలు పెట్టందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పనులు చేసే ప్రతి చోట పెయింట్‌తో ప్రత్యేకంగా పని వివరాలతో బోర్డును తయారు చేయించి అక్కడ పెట్టించాలన్నారు. మండలంలో చాలా గ్రామా ల్లో ఒకే కుటుంబంలోని సభ్యులు వివిధ గ్రూపుల్లో ఉన్నారని, దీంతో ఆ కుటుంబంలో చాలా మందికి పనులు కల్పించలేక పోతున్నామన్నారు. అయితే కుటుంబంలోని సభ్యులను వివిధ గ్రూపుల నుంచి ఒక్కటే గ్రూపుల్లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సస్పెన్స్ డబ్బులు రూ.16 లక్షల వరకు ఉన్నాయని, నేటికీ కూలీలకు డబ్బులు రాలేదని ఏపీడీ దృష్టికి ఉపాధి సిబ్బంది తీసుకొచ్చారు. స్పందించిన ఆయన ఇంత వరకు ఉంటే ఎలా అని సిబ్బందిని ప్రశ్నించారు. త్వరగా కూలీల ఆధార్ కార్డు, వారి అకౌంట్ల నంబరు తీసుకొని కంప్యూటర్లలో నమోదు చేయాలన్నారు. వెంటనే వారి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు.

ఉపాధి కూలీ పని చేసే వారికి తప్పకుండా ఆధార్ కార్డు, అకౌంట్ నంబరు ఉండాలని, లేకుంటే వారికి కూలీ డబ్బులు పడవన్నారు. ఈ విషయాలపై గ్రామాల్లో కూలీలకు అవగాహన కల్పించాల్సిన బాధ్య త తమపై ఉందన్నారు. నివేదన యాప్‌పై ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో, ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, రేషన్ షాపుల దగ్గర నివేదన పోస్టర్లను అతికించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణ, ఎంపీడీవో గోవిందరావు, ఏపీవో శరత్‌కుమార్, ఈసీ శివజ్యోతి, సూర్యప్రకాశ్‌రెడ్డి, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...