పప్పుశనగ మద్దతు ధరపై.. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి


Fri,February 23, 2018 03:20 AM

ఉండవెల్లి : కేంద్ర ప్రభు త్వం పప్పుశనగ పంటకు 6వే ల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణు వర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పప్పుశనగ కొనుగోలు కేం ద్రం ప్రారంభాన్ని గురువారం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి పప్పుశనగ విత్తనాలను క్వింటాలుకు రూ. 8,200లకు దిగుమతి చేసుకుని, తెలంగాణ ప్రభుత్వం 40 శాతం భారంతో రూ.5,850లకు సబ్సిడీ ద్వారా రైతుల కు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో రైతులు 35వేల ఎకారాలలో పప్పుశనగను సాగుచేశారని అన్నారు. రైతులు పప్పుశనగ పంటను విక్రయించేందుకు సిద్ధంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ.4,250 లు చెల్లిస్తున్నదని, దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.150రూపాయల బోనస్ కలిపి రూ.4400 లకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పప్పుశనగకు 6వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షాబాదరవి, పీఏసీఎస్ చైర్మన్ మహే శ్వరరెడ్డి, మార్క్‌ఫైడ్ డీఎం శివనాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి పుష్ప మ్మ, పీఎసీఎస్ సీఈవో కేశవరెడ్డి, ఎంపీపీ జయమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...