రాబోయే బడ్జెట్‌లో.. బీసీలకు భారీ నిధులు


Fri,February 23, 2018 03:20 AM

గట్టు : రాబోయే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ స్పష్టం చేశారు. మండలంలోని తుమ్మలపల్లి, మిట్టదొడ్డిలలో గ్రామదేవతల ఉత్సవాలకు ఆయన గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. గత ప్రభుత్వాలు బీసీల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువస్తోందని చెప్పారు. విశ్వబ్రాహ్మణ, రజక, నాయి బ్రాహ్మణ కులాల అభివృద్ధి కోసం కార్పొరేషన్ల ద్వారా రుణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. బీసీలు అభివృద్ధి కాకపోవడానికి ఐక్యత లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్‌ను నడిగడ్డ యువత సభ్యులు, గౌడ కులస్తులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించా రు. గ్రామాల సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందమ్మ సత్యన్నగౌడ్, బీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు బింగిదొడ్డి వెంకటేశ్, మేకల తిమ్మప్ప, ఎస్ రామునాయుడు, నర్సన్న, వెంకటేశ్, భాస్కర్, మునిచంద్రగౌడ్, నర్సింహులు, వీరేశ్‌నాయుడు, గోవర్ధన్‌గౌడ్, నడిగడ్డ యువత జిల్లా అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, భాస్కర్, లక్ష్మీకాంత్‌గౌడ్, నాయకులు రామకృష్ణ, వీరేశ్‌నాయుడు, మిట్టదొడ్డి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...