వానాకాలం నాటికి రుణాలు ఇవ్వాలి


Thu,February 22, 2018 12:12 AM

-కాటన్ సీడ్ రైతులకు ఎకరాకు రూ.94వేల నుంచి 1లక్షా 24వేల వరకు ఇవ్వాలి
-సకాలంలో యంత్రాలను మంజూరు చేయాలి
-బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ రజత్‌కుమార్‌సైని

గద్వాల టౌన్ : వచ్చే వానాకాలం నాటికి రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందజేయాలని బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని సూచించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ వివిధ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాటన్ సీడ్ రైతులకు ప్రతి ఎకరాకు రూ. 94 వేల నుంచి రూ.1.24 లక్షల వరకు అందజేయాలన్నారు. రైతులకు ఉపయోగపడే యంత్రాలను సకాలంలో మంజూరు చేయాలని సూచించారు. రైతులకు క్రాప్ రెన్యూవల్ చేసేందుకు వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానవన శాఖలో మిషనరీల సబ్సిడీలు గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవా లన్నారు. మార్చి 15 లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాలను గ్రౌండింగ్ పూర్తి చేయాలని చెప్పారు.

మహిళా సంఘాల్లో, కార్పొరేషన్‌లో బాకీలుంటే ఆర్‌ఆర్ యాక్టు అమలు చేసి వసూలు చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన వారికి వెంటనే రుణాలు ఇవాల్సిన అవసరం ఉందన్నారు. పొటెన్షియల్ లింక్‌డ్ ప్లాన్ 2018-19 సంవత్సరానికి రూ.2078 కోట్లను వివిధ రంగాల్లో రుణాలు ఇచ్చేందుకు టార్గెట్ నిర్దారించడం జరిగిందన్నారు. పట్టణ రుణాలు రూ.1024 కోట్లు, వ్యవసాయానికి రూ.1650 కోట్లకు ప్రణాళిక నిర్ధారించారని చెప్పారు.

జిల్లా పరిధిలోని గద్వాల, మల్దకల్ మండలాల్లో కూరగాయల అభివృద్ధి, పాడి పరిశ్రమలను నాబార్డు సంస్థ గుర్తించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముద్ర రుణాలు, ఎస్టీ కార్పొరేషన్ ఇతర రుణాలను సకాలంలో అందించేందుకు బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీజీఎం ధనరాజ్, జిల్లా కో-ఆపరేటివ్ డీజీఎం కుబేరుడు, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్, ఏపీజీవీబీ మేనేజర్ రాజు, రిజర్వ్ బ్యాంకు అధికారి శ్రీధర్, నాబార్డు అధికారి అనితాబార్ధవన్, రవీందర్‌కుమార్, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది
దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుం దని కలెక్టర్ రజత్ కుమార్ సైని అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన ఆటోను ఒకరికి అందజేశారు. అలాగే కలెక్టర్ కార్ఫస్ ఫండ్ కింద మంజూరైన మూడు ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు కలెక్టర్ అందజేశారు. ఆటోను, ద్విచక్ర వాహనాలను సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులకు సూచించారు. అలాగే నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ ఇన్‌ఫుట్ క్రెడిట్ బ్యాంకు పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆంధ్రాబ్యాంకు డీజేఎం ధనరాజు, ఎస్‌బీఐ మేనేజర్ శేషిగిరిరావు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...