సేవంటే ఇది..


Thu,February 22, 2018 12:10 AM

మల్దకల్ : సమాజంలో ప్రతి ఒక్కరి మార్పునకు శ్రీకారం చుట్టాలంటే ముందు తాము ఆచరించడంతో పాటు పరులకూ సేవ చేయాలనే సంకల్పాన్ని ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు తమ సేవాగుణంతో చాటారని, సేవంటే ఇలా ఉండాలని ఎంపీడీవో గోవిందరావు, సర్పంచ్ విజయలక్ష్మీలు అభినందించారు. అమరవాయిలో ఆరు రోజులుగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వివిధ రకాలైన పనులు చేస్తూ గ్రామానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, పారిశుధ్యం పై అవగాహన కల్పిస్తూ చేపట్టిన పనులు బాగున్నాయని కితాబిచ్చారు. గ్రామం లో ఇంటి ముందు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులు నిర్మించుకుంటూ అసంపూర్తిగా ఉన్న 50 ఇంకుడుగుంతలను ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పూడ్చివేశారన్నారు. వాటి ఆవశ్యకతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారన్నారు. ఇదే సందర్భంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ మరుగుదొడ్డి నిర్మాణంపై అవగాహన కల్పించారు.

జీవితంలో మరుగుదొడ్డి ఎంత అవసరమో తమ ఆట పాటలతో వివరించడంతో గ్రామస్తులను చైతన్యం చేసినట్లయ్యిందన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా మారాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విద్యార్థులు చూపిన బాటలో గ్రామాన్ని ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండేలా ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బస్టాండ్ నుంచి గ్రామ పాఠశాల వరకు ఇరువైపులా, ఇతర ఖాళీ ప్రదేశాల్లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అంబర్‌సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...