విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ


Thu,February 22, 2018 12:10 AM

గద్వాల రూరల్ : మండల పరిధిలోని వెంకంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులే ఉపాధ్యాయులే ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నటు,్ల పాఠశాల ప్రదానోపాధ్యాయులు నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈవోగా నరేష్,ఎంఈవోగా కార్తిక్, హెచ్‌ఎంగా జితేందర్, ఉపాధ్యాయులుగా నవ్య, మహేశ్వరి, రేవతి, నవీన, పావని, నవీన్‌కుమార్, ప్రవీణ్, నరేష్, గీత, రమ, హరిత, జ్యోతి, బుజ్జి వివిధ పాత్రలను పోషించి చక్కగా బోధించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నాగరాజు, వెంకటేశ్వర్లు, సుమిత్ర, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...