ఆధునిక టెక్నాలజీతో పరిశోధన చ ఏయాలి


Thu,February 22, 2018 12:08 AM

పాలమూరు యూనివర్సిటీ : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య భూక్యరాజారత్నం సూచిం చారు. పీయూ పరిపాలన భవనంలో బుధవారం నేషనల్ సైన్స్ సెమినార్‌ను చేశారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పాలమూరు విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగంలో పని చేస్తున్న అధ్యాపకులు అనుభవాలను తీసుకొని పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. పాలమూరు జిల్లా అంటే దేశంలో గుర్తుండే విధంగా విద్యార్థులు తయారు కావాలని అన్నారు. మానవ జీవితం సైన్స్‌కు ముడిపడి ఉందన్నారు.

మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎన్నో రకల అనుభవాలను సంతరించుకుంటాడని, ఇవన్నీ సైన్స్‌కు అనుసంధానంగా ఉంటాయన్నారు. ఉత్తమ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రతిదీ సైన్స్‌పై ముడిపడి ఉందని సూచించారు. పీయూలోని విద్యార్థులకు ఎలాంటి సహకారం కావాలన్నా తమను సంప్రదించాలని సూచించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి.సత్యనారాయణ మాట్లాడుతూ పీయూలోని విద్యార్థులు దేశం గర్వించే విధంగా తయారు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ డాక్టర్.ఐనవోలు పాండురంగారెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్‌జైపాల్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కుమారస్వామి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సిములు, ఓఎస్‌డీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డీన్ డాక్టర్ పవన్‌కుమార్ సైన్స్ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ ఎన్‌వైఎస్ మూర్తి, పీయూ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...