మ(ము)రిపించి


Wed,February 21, 2018 12:45 AM

-ఇంటిని మరిపించే భోజనం
-కస్తూర్బా విద్యార్థినులకు రుచికర భోజనం
-విద్యతో పాటు ఆరోగ్య రక్షణ
-బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం

అలంపూర్,నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా 2018 జనవరి నుంచి కస్తూర్బా , మోడల్, గురుకుల పాఠశాల ల్లో బాలికలకు బలవర్ధకమైన ఆహారం అందిస్తూ ఇంటిని మరిపింపచేస్తుంది. దీంతో విద్యార్థినులు మురిసి పోతున్నారు. ఒకప్పుడు ఉడికీ ఉడకని అన్నం, దోడ్డు బియ్యం అన్నం తినలేక అర్ధ్దాకలితో అలమటిస్తూ విద్యపై ధ్యాస మరల్చ లేక పోయేవారు. వసతి గృహాల్లో విద్యార్థుల కష్టాలను, ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని మరిపించే బలవర్ధకమైన భోజనం రోజుకు ఐదు సార్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిం ది. 2018 జనవరి నెల నుంచి అమలు చేస్త్తోంది కూడా. సన్న బియ్యం బువ్వ, రోజుకు ఐదు సార్లు పౌష్టికాహారం, వారానికి రెండు సార్లు మాంసాహార భోజనం, కాలానుగుణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు 15 వస్తువులతో కూడిన కాస్మోటిక్ కిట్స్ అందజేస్తోంది. వీటన్నింటినీ సమకూర్చి విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. కస్తుర్బా అంటేనే ఎవరు లేని అనాథలు అన్న భావన ఉండేది.

అలాంటిది అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటిని మరిపించే విధంగా నేడు ముందుకు తీసుకుపోతుంది. గతంలో కేవలం రెండు పూటల తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలుండేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబువ్వతో పాటు రోజుకు ఐదు పూటల పౌష్టికాహారం అందిస్తూ ఉన్నతమైన విద్యను అందిస్తుంది. బాలికల అభ్యున్నతి కోసం సాహసం చేసి కొత్త మెనూను అమలు చేయడంపై బాలికలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కస్తుర్బాలోనే కాకుండా అన్ని గురుకులాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తుంది. గతంలో సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారం పెట్టేవాళ్ళు. విద్యార్థుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా సమతుల్యంగా ప్రొటీన్లు, విటమిన్లు అందేలా ఎంత ఖర్చు అయినా భరిస్తూ వెనుకాడకుండా నెలలో మూడు రోజులు చికెన్, రెండు రోజులు మటన్ ఇవ్వాలని నిర్దేశించింది.

అంతే కాకుండా రోజు బూస్ట్, రాగి జావా, హార్లిక్స్ అందిస్తున్నారు. ప్రతి రోజు ఐదు సార్లు పౌష్టికాహారం అందించేలా మెనూలో మార్పులు చేసింది. రోజుకు 150 గ్రాముల పాలు, 200 గ్రాముల ఆకు కూరలు, లేదా కూరగాయలు, 500 గ్రాముల అన్నం అందిస్తుంది. వారంలో 150 గ్రాముల చికెన్ 40 గ్రాముల మటన్ భోజనంతో పాటు వడ్డిస్తారు.

అల్పాహారం మెనూ ఇలా..
ఆదివారం రెండు చపాతీలు ఆకు కుర్మ, సోమవారం నాలుగు ఇడ్లీలు, సాంబర్, చట్నీ, మంగళవారం నాటు రవ్వ ఉప్మా, బుధవారం నాలుగు పూరీలు, పెసర పప్పు, గురువారం నాలుగు ఇడ్లీలు సాంబరు, చట్నీ, శుక్రవారం నాటు రవ్వ ఉప్మా, పల్లి పుట్నాల చట్నీ, శనివారం అటుకుల ఉప్మా అందిస్తున్నారు.

మధ్యాహ్న భోజనం
ఆదివారం బగార అన్నం, ఒకటి , మూడు, ఐదో ఆదివారాల్లో కోడి కూర, రెండు,నాలుగో ఆదివారాల్లో మటన్ కర్రీతో, ఏదైనా ఒక రకమైన కుర్మాతో రసం, పెరుగుతో అందిస్తారు. సోమవారం అన్నం, ఉడకబెట్టిన గుడ్డు, ఆలు, వంకాయ కూర, పప్పు, రసం, పెరుగు, నెయ్యితో వడ్డిస్తారు. మంగళవారం అన్నం, గుడ్డు, బీట్‌రూట్ లేదా క్యారెట్ పప్పు, మునగాకు రసం, పెరుగు, నెయ్యి. బుధవారం అన్నం, బెండకాయ, పుప్పతో పాలకూర, రసం, పెరుగు, నెయ్యి. గురువారం అన్నం, గుడ్డు, ఆలుగడ్డ పప్పుతో గోం గూర, రసం, పెరుగు, నెయ్యి. శుక్రవారం అన్నం కో డికూర, దోసకాయ పప్పు, తోటకూర, రసం, పెరు గు, నెయ్యి. శనివారం అన్నం, బీరకాయ పుప్పతో చుక్కకూర, రసం, పెరుగు, నెయ్యి వడ్డిస్తారు.

రాత్రి భోజనం
ఆదివారం అన్నం, వంకాయ,బీన్స్. సోమవారం అన్నం, క్యాబేజీ లేదా బెండకాయ, చట్నీ, సాంబరు, మజ్జిగ, అరటి పండ్లు. మంగళవారం అన్నం, దోశ, చట్నీ సాంబర్, మజ్జిగ, అరటి పండు. బుధవారం అన్నం, కోడి కూర లేదా ఆలుకుర్మా చట్నీ, సాంబరు. గురువారం అన్నం, బీట్‌రూట్, చట్నీ, సాంబరు, అరటి పండు. శుక్రవారం అన్నం, ఆలుగడ్డ కూర, చట్నీ, సాంబరు, మజ్జిగ, అరటి పండు. శనివారం అన్నం, వంకాయ లేదా కాకార కాయ, చట్నీ, సాంబరు, మజ్జిగ అరటి పండు, సీజనల్ ఫ్రూట్స్ అందిస్తారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...