ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి


Wed,February 21, 2018 12:39 AM

నాగర్‌కర్నూల్‌టౌన్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాతీయ మానవ హక్కుల ప్రత్యేక పరిశోధకురాలు జలజ అన్నారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును సందర్శించి ఖైదీలలతో వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జైలులో ఖైదీలకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకున్నారు. దొంగతనాలు అరికట్టే విధానాలు, అట్రాసిటీ కేసులు ఎన్ని అయ్యాయి, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెట్టి చాకిరి చేయించుకుంటున్న వారిపై ఎన్ని కేసులు నమోదయ్యాయని అడిగి తెలుసుకున్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన వారికి ఉపాధి కల్పించాలన్నారు. దవాఖానల్లో, సబ్‌సెంటర్లలో పరిసరాలు, బాత్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు.

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్టులో ఎన్ని హెక్టార్లలో మొక్కలు నాటారు, ప్రస్తుతం ఎన్ని నాటనున్నారని అడిగి తెలుసుకున్నారు. మరింత ఎక్కువగా నాటాలని సూచించారు. అంగన్‌వాడీలలో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేయాలన్నారు. జిల్లాలో ఎంత మందికి రేషన్ అందుతుందని వివరాలపై ఆరా తీశారు. జిల్లాలో 2 లక్షల 28 వేల 619 రేషన్‌కార్డులు ఉన్నాయని, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఈ-పాస్ మిషన్ ద్వారా బియ్యం ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. సమావేశంలో జేసీ సురేందర్‌కరణ్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఆర్‌వో మధుసూదన్‌నాయక్, జిల్లా ఫారెస్టు అధికారి జోజి, డీఆర్‌డీవో సుధాకర్, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...