కోస్గిలో డిపో నిర్మిస్తాం


Tue,February 20, 2018 12:19 AM

కోస్గి : కోస్గిలో బస్‌డిపోను రూ. 2.50 కోట్లతో నిర్మిస్తామని త్వరలో బస్‌డిపో కోసం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో శంకుస్ధాపన చేయిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం కోస్గి మండలంలో రూ.20 కోట్ల నిధులతో మండలంలో ఆయా గ్రామాలకు బీటీ రహదారులను ఏర్పాటుతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 97 బస్‌డిపోలు ఉన్నాయని, కోస్గి బస్‌డిపో ఏర్పాటుతో 98 బస్‌డిపోలు అవుతాయన్నారు. ఆర్‌టీసీ బస్సులు ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి తిరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ముఖాల్లో వెలుగులు చూసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటు గత పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తించి రాబోయే తరాలకు దోహదపడే విధంగా దేశం మెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల స్థితి గతులు మా రేందుకు బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ అంటే బంగారు నగలతో ఉన్న రాష్ట్రం కాదని బతుకులు మారే విధంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజల స్థితిగతులు మారే విధంగా చేసే తెలంగాణ అని గుర్తు చేశారు. తాను పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక రూ.140 కోట్ల నిధులు కేవలం ఏడు నియోజకవర్గాలకు కేటాయించానని తెలిపారు. ఈ నిధులతో కేవలం బీటీ రోడ్లు, రూ. 50 కోట్లతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్‌లు, మహిళా సంఘాల భవనాలు నిర్మించేందకు కేటాయించడం జరిగిందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు. ఈ సమావేశంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అన్న కిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జడ్పీటీసీ రాస్నం అనితాబాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి డీకే నాగేశ్వర్, ఓంప్రకాశ్, శ్యాసం రామకృష్ణ, ముద్దప్ప, పట్టణ అధ్యక్షుడు శ్యాంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...