పంట పండిందిల


Mon,February 19, 2018 12:11 AM

-ఉమ్మడి జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు
-గతేడాదికన్నా పెరిగిన దిగుబడి
-మార్కెట్లను ముంచెత్తుతున్న పల్లి
-కృష్ణా నీటితో రైతన్నకు సిరులు
-ఆనందంలో కర్షకులు

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : యాసంగి సీజన్‌లో వేరుశనగ పంటను సాగు చేసిన రైతుల పంట పండింది. గతేడాదికన్నా ఈసారి అధికంగా పంట సాగు చేపట్టారు. దిగుబ డి కూడా బాగా వస్తుండటంతో ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది.

2.60 లక్షల ఎకరాలలో సాగు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2,60,755 ఎకరాలలో వేరుశనగ పంటను ఈ యాసంగింలో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. ప్రా జెక్టుల్లోకి నీరు రావడంతో ఎంజీకేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు, చెరువులను కృష్ణా నీటితో నిం పారు. దీంతో కాలువలకు నీటిని వదలడంతో సా గుబడులు పెరిగాయి. నీటి సౌలభ్యం పెరగడంతో మొదట వేరుశనగ సాగుకు రైతన్న ప్రాధాన్యమిచ్చాడు. ఆ తర్వాత వరిని సాగు చేశాడు. అయితే గతేడాదికన్నా ఈసారి 20 శాతం వేరుశనగ సాగు పెరిగింది.
వేరుశనగతో మార్కెట్‌లో కళకళ..
యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లా రైతన్నలు అధికంగా వేరుశనగను సాగు చేసారు. నేడు పంట చేతికందుతున్నది. పలు ప్రాంతాల్లో వేరుశనగను మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో ఏ మార్కెట్‌లో చూసినా వేరుశనగ రాసులే దర్శనమిస్తున్నాయి. నీటి వసతి ఉండటంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో రైతన్న ఇంట సిరులు నిండాయి. గతంలో ఎప్పుడూ యాసంగి సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో వేరుశనగ పంట సాగైన దాఖలాలు లేవు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తొలిసారిగా ప్రభుత్వం వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మద్దతు ధర రూ.4250 లుగా నిర్ణయించింది. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, గద్వాల, పెబ్బేరు, మదనాపురం, మక్తల్, దేవరకద్ర మార్కెట్లు వేరుశనగతో కళకళలాడుతున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో అధికంగా..
యాసంగి సీజన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,24,460 ఎకరాల్లో వేరుశనగ పంట సాగైంది. ఇంత ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడా సాగు కాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా 57 వేల ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో 55 వేల ఎకరాలు, గద్వా ల జిల్లాలో 23,302 ఎకరాలలో పంట సాగైంది. దిగుబడులు సైతం గతంలోకంటే అధికంగా వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
దిగుబడి బాగుంది ..
యాసంగిలో సాగు చేసిన వేరుశనగ దిగుబడి ఆశాజనకంగా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో బోరు బావులపైనే ఆధారపడి పంటను సాగు చేయగా.. నేడు ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తుండటంతో పంటు సాగు పెరిగింది. గతంలో ఎకరాకు 5 నుంచి 6 క్వింటా ళ్లు మాత్రమే దిగుబడి రాగా.. నేడు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

వలసలు వాపస్..
ఎత్తిపోతల పుణ్యమా అని రెండేళ్ల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలే మారా యి. గతంలో నీటి సౌలభ్యం లేక వానకాలం పంట సాగు అనంతరం బతుకు దెరువు కోసం ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టేందుకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించారు. రిజర్వాయర్లు, చెరువులను నింపారు. కా లువలకు నీటిని వదిలారు. దీంతో బీళ్లుగా దర్శనమిచ్చిన పొలాలు సైతం సాగులోకి వచ్చాయి. ఏడాదికి రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. సొంత ఊళ్లల్లోనే వ్యవసాయం బాగా ఉండటంతో వలసలు వెళ్లిన వారు సైతం తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో జిల్లా మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి కృషితో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులైన ఎంజీకేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనులు పూర్తి చేయడంతో నేడు వ్యవసాయం పండుగలా సాగుతున్నది.

625 చెరువులకు కృష్ణా నీళ్లు..
ఈ ఏడాది ప్రాజెక్టుల నీటితో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రామన్‌పాడు, శంకరసముద్రం, రంగసముద్రం, ఏనుగుంట, కృష్ణ సముద్రం, సంగంబండ, భూత్పూరు, గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు, జొన్నలబొగుడ, గుడిపల్లి, సింగోటం రిజర్వాయర్లు నీటితో నిండుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 675 చెరువులను నీటితో నింపారు. ఎంజీకేఎల్‌ఐ పరిధిలో 400 చెరువులు, భీమా ఫేస్-2లో 105, నెట్టెంపాడ్‌లో 100, భీమా ఫేస్-1లో 45, కోయిల్‌సాగర్ పరిధిలో 25 చెరువులను నింపారు. /updates/2018/feb/19/jogulambanews.jpg

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...